Samsung Galaxy A32: 64 MP కెమెరాతో శాంసంగ్ ఫోన్ రిలీజ్

Samsung Galaxy A32: గెలాక్సీ A సిరీస్‌లో కొత్త ఫోన్‌ను శాంసంగ్‌ ఈ రోజు ఇండియాలో రిలీజ్ చేసింది.

Update: 2021-03-03 13:20 GMT

Samsung Galaxy A32 (ఫోటో హన్స్ ఇండియా)

Samsung Galaxy A32: గెలాక్సీ A సిరీస్‌లో కొత్త ఫోన్‌ను శాంసంగ్‌ ఈ రోజు ఇండియాలో రిలీజ్ చేసింది. గత వారం గెలాక్సీ A32 4జీ పేరుతో రష్యాలో విడుదలైన మొబైల్‌ను అదే పేరుతో ఇండియాలో లాంచ్‌ చేశారు. 64MP కెమెరాతో విడుదలైన ఈ ఫోన్ 90 హెర్ట్జ్ డిస్‌ప్లేతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. రూ .21,999 ధరతో అందుబాటులో ఉంది. 6.4-అంగుళాల FHD + sAMOLED స్క్రీన్‌తో వచ్చిన ఈ ఫోన్ బుధవారం నుంచి రిటైల్ షాప్స్, ఆన్‌లైన్ లో లభిస్తుంది.

విడుదల సందర్భంగా కొన్ని ఆఫర్స్ ను ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇఎంఐ లావాదేవీలపై రూ .2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చని పేర్కొంది. అప్పుడు గెలాక్సీ ఎ 32 రూ .19,999 ధరకే లభిస్తుంది.

మరికొన్ని విశేషాలు చూద్దాం..

వెనుకవైపు 64 MP కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ 123-డిగ్రీల యాంగిల్ తో ఫొటోస్ తీస్తుంది. 5MP మాక్రో లెన్స్ తో క్లోజప్ షాట్లను తీయడానికి సహాయపడుతుంది. అలాగే 5MP డెప్త్ కెమెరా 'లైవ్ ఫోకస్' మోడ్‌లో పోట్రాయిట్ షాట్‌లను తీస్తుంది. ముందువైపు 20 ఎంపీ కెమెరా ఉంటుంది.

ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత వన్‌ యూఐ 3.0తో ఈ ఫోన్ పని చేస్తుంది.

మీడియాటెక్‌ హీలియో జీ 80 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటక్షన్‌ ఇస్తున్నారు.

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగి ఉంది. ఇది 15 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.

6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది.

Tags:    

Similar News