Samsung Galaxy A Series: 4జీ, 5జీ కొత్త ఫోన్లను లాంచ్ చేసిన సామ్ సంగ్
Samsung Galaxy A Series: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ22 5జీ, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ 22 4జీ ఫోన్లను తాజాగా విడుదల చేసింది.
Samsung Galaxy A Series: త్వరలో భారత్ మార్కెట్ లోకి 5జీ సేవలు అందుబాటులోకి రానున్ననేపథ్యంలో 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సామ్‌సంగ్ ఏ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ22 5జీ, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ 22 4జీ ఫోన్లను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లపై ఓ లుక్కేయండి..
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ22 5జీ: 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే. (90హెడ్జ్ రీఫ్రెష్ రేట్), ఆక్టా కోర్ ఎస్ఓసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ (1టీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు), 48 మెగాపిక్సెల్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా ఈ ఫోన్ సొంతం. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ దీని మరో ప్రత్యేకత. 5000 ఎమ్ఏహెచ్‌తో కూడిన ఈ ఫోన్ 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ22 4జీ: 6.4 అంగుళాల హెచ్‌డీ + సూపర్ ఆమోఎల్ఈడీ డిస్‌ప్లే. (90 హెడ్జ్ రీఫ్రెష్ రేట్), 6జీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్. 48 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింగ్ స్కానర్. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వీటి స్పెషల్.