Website Real or Fake: వెబ్‌సైట్‌ నిజమైనదా నకిలీదా ఇలా గుర్తుపట్టండి.. లేదంటే మోసపోతారు..!

Website Real or Fake: ఈ రోజుల్లో ఈ కామర్స్‌ బిజినెస్ బాగా పెరిగింది. ఆకర్షణీయమైన తగ్గింపులతో వినియోగదారులను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇందులో కొన్ని ఫేక్‌ వెబ్‌సైట్స్‌ కూడా ఉంటున్నాయి.

Update: 2024-01-08 12:30 GMT

Website Real or Fake: వెబ్‌సైట్‌ నిజమైనదా నకిలీదా ఇలా గుర్తుపట్టండి.. లేదంటే మోసపోతారు..!

Website Real or Fake: ఈ రోజుల్లో ఈ కామర్స్‌ బిజినెస్ బాగా పెరిగింది. ఆకర్షణీయమైన తగ్గింపులతో వినియోగదారులను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇందులో కొన్ని ఫేక్‌ వెబ్‌సైట్స్‌ కూడా ఉంటున్నాయి. వీటివల్ల కొంతమంది వినియోగదారులు తరచుగా మోసాలకు గురవుతున్నారు. చాలా మంది నిజమైన వెబ్‌సైట్‌లకు , నకిలీ వెబ్‌సైట్‌లకు తేడాను అర్థం చేసుకోలేక మోసపోతున్నారు. ఫలితంగా మోసాలకు గురవుతున్నారు. వెబ్‌సైట్ నిజమైనదా లేదా నకిలీదా అని గుర్తించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వెబ్‌సైట్ URL

నిజమైన వెబ్‌సైట్‌ల URLలు సాధారణంగా కంపెనీ లేదా సంస్థ పేరుకు సరిపోలే డొమైన్ పేరును కలిగి ఉంటాయి. ఉదాహరణకు మీరు Amazon వెబ్‌సైట్‌ను చూసినట్లయితే URL “[https://www.amazon.in/](https://www.amazon.in/)”గా ఉంటుంది. URLలో కంపెనీ లేదా సంస్థ పేరు లేకుంటే అది నకిలీ వెబ్‌సైట్ అయ్యే అవకాశం ఉంది.

వెబ్‌సైట్‌ డిజైన్

ఒరిజినల్ వెబ్‌సైట్‌లు సాధారణంగా నిపుణుల సాయంతో బాగా డిజైన్ చేయబడతాయి. కొన్నిసార్లు ఏదైనా వెబ్‌సైట్ తప్పులను కలిగి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది నకిలీ వెబ్‌సైట్ అవుతుంది.

వెబ్‌సైట్ కంటెంట్

నిజమైన వెబ్‌సైట్‌ల కంటెంట్ నమ్మదగినదిగా ఉంటుంది. ఒకవేళ వాటిలో తప్పులు కనిపిస్తే, అసంపూర్తి సమాచారం ఉంటే అది నకిలీ వెబ్‌సైట్ అవుతుందని గుర్తుంచుకోండి. ఆ వెబ్‌సైట్‌ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుందని అర్థం చేసుకోండి.

వెబ్‌సైట్ భద్రత

వెబ్‌సైట్‌లు సాధారణంగా సురక్షిత కనెక్షన్ (HTTPS)ని కలిగి ఉంటాయి. వెబ్‌సైట్ చిరునామాలో HTTPS లేకపోతే అది నకిలీ వెబ్‌సైట్ అవుతుంది.

వెబ్‌సైట్‌లో సంప్రదింపు వివరాలు

నిజమైన వెబ్‌సైట్‌లలో కంపెనీ లేదా సంస్థ చిరునామా, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఉంటుంది. సంప్రదింపు వివరాలు లేకున్నా అస్పష్టంగా ఉన్నా అది నకిలీ వెబ్‌సైట్ కావచ్చు.

సోషల్ మీడియా లింక్‌లు

ఒరిజినల్ వెబ్‌సైట్‌లు సాధారణంగా కంపెనీ లేదా సంస్థ సోషల్ మీడియా పేజీలకు లింక్‌లను కలిగి ఉంటాయి. వెబ్‌సైట్‌లో సోషల్ మీడియా లింక్‌లు లేకుంటే అది నకిలీ వెబ్‌సైట్ అయ్యే అవకాశం ఉంది.

నకిలీ వెబ్‌సైట్‌లను నివారించాలంటే మీ బ్రౌజర్‌లో సెక్యూరిటీ సెట్టింగ్స్‌ చేయండి. తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి. వెబ్‌సైట్‌లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేసేముందు జాగ్రత్తగా ఉండండి.

Tags:    

Similar News