Jio: జియో కొత్త యాన్యువల్ ప్లాన్స్‌.. అందుబాటులో కేవలం రెండే ఆప్షన్స్‌..

Jio: జియో కొత్త యాన్యువల్ ప్లాన్స్‌.. అందుబాటులో కేవలం రెండే ఆప్షన్స్‌..

Update: 2024-07-19 09:44 GMT

Jio: జియో కొత్త యాన్యువల్ ప్లాన్స్‌.. అందుబాటులో కేవలం రెండే ఆప్షన్స్‌.. 

Jio: దేశంలో అన్ని టెలికాలం కంపెనీలు టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. జియో మొదలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ఐడియాలు టారిఫ్‌లను భారీగా పెంచేశాయి. ఏకంగా 15 నుంచి 25 శాతం వరకు ఛార్జీలను పెంచాయి. ఈ క్రమంలోనే టెలికాం ఆపరేటర్లు ప్లాన్స్‌లో పలు మార్పులు, చేర్పులు చేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం సంస్థ జియో వార్షిక ప్లాన్స్‌లో కీలక మార్పులు చేసింది.

ఛార్జీలు పెంచకముందు పలు వార్షిక ప్లాన్స్‌ అందుబాటులో ఉండగా ప్రస్తుతం కేవలం రెండు ప్లాన్స్‌ మాత్రమే యూజర్లకు అందిస్తున్నారు. అయితే డేటా విషయంలో 1.5 జీబీ, 2 జీబీ వంటి ప్లాన్స్‌ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జియో అందిస్తున్న ఆ రెండు ప్లాన్స్‌ ఏంటి.? వీటి వల్ల ఎలాంటి బెనిఫిట్స్‌ ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* రూ.3,999 ప్లాన్‌..

రూ. 3,999తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు కాల్స్‌ పొందొచ్చు. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, 2.5 జీబీ డేటా పొందొచ్చు. వీటితో పాటు ఫ్యాన్‌కోడ్‌, జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఫ్యాన్‌కోడ్‌ సభ్యత్వం జియోటీవీ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందాల్సి ఉంటుంది. అయితే జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌లో ప్రీమియం కంటెంట్ లభించదు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా కూడా ఉండదు.

* రూ.3,599 ప్లాన్‌..

జియో అందిస్తున్న మరో వార్షిక ప్లాన్‌ రూ. 3599. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. అలాగే రోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి అన్‌లిమెటెడ్‌ 5జీ డేటా ఉచితంగా పొందొచ్చు. జియో సినిమా, జియోటీవీ, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందొచ్చు. దీంట్లోనూ జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీమియం కంటెంట్ ఉండదు.

Tags:    

Similar News