రిలయన్స్‌ జియో చౌకైన ల్యాప్‌టాప్‌.. ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

రిలయన్స్‌ జియో చౌకైన ల్యాప్‌టాప్‌.. ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Update: 2022-10-30 12:30 GMT

రిలయన్స్‌ జియో చౌకైన ల్యాప్‌టాప్‌.. ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Reliance Jio: రిలయన్స్ జియో తొలి ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM) పోర్టల్‌లో జాబితా చేసింది. ఫీచర్లు, ధరని వెల్లడించింది. జియో Qualcomm Snapdragon 665 11.6 అంగుళాల నెట్‌బుక్‌గా జాబితా చేశారు. ల్యాప్‌టాప్ ధరని రూ. 19,500గా నిర్ణయించారు. అయితే దీనిని అందరు కొనుగోలు చేయలేరు. కేవలం ప్రభుత్వ విభాగాలు మాత్రమే GeM పోర్టల్ ద్వారా షాపింగ్ చేయగలవు. అయితే త్వరలో సామాన్యులందరికి అందుబాటులకి వస్తుందని చెబుతున్నారు.

జియో ల్యాప్‌టాప్ ఫీచర్లు.

ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ వెబ్‌సైట్‌లో జాబితా చేసిన ఈ ల్యాప్‌టాప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా నడుస్తుంది. ఇది స్టాండర్డ్ ఫారమ్ ఫ్యాక్టర్‌ని కలిగి ఉంటుంది. మెటాలిక్ హింగ్‌లతో వస్తుంది. ల్యాప్‌టాప్ JioOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. జియో ల్యాప్‌టాప్ 2GB LPDDR4X ర్యామ్‌ను ప్యాక్ చేస్తుంది.

డిస్ప్లే విషయానికి వస్తే జియో ల్యాప్‌టాప్ 11.6-అంగుళాల HD LED బ్యాక్‌లిట్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్క్రీన్ నాన్-టచ్, 1366×768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. పరికరంలోని పోర్ట్‌లలో USB 2.0 పోర్ట్, USB 3.0 పోర్ట్, HDMI పోర్ట్ ఉంటాయి. మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా అందుబాటులో ఉంటుంది.

ల్యాప్‌టాప్‌లోని వైర్‌లెస్ కనెక్టివిటీకి Wi-Fi 802.11ac సపోర్ట్‌ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. ఇది 4G మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. జియో ల్యాప్‌టాప్ డ్యూయల్ ఇంటర్నల్ స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్‌లతో వస్తుంది.బ్యాటరీ విషయానికొస్తే జియో ల్యాప్‌టాప్ 8 గంటల బ్యాకప్‌తో 55.1-60Ah బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పరికరం 1.2 కిలోల బరువు ఉంటుంది. ఒక సంవత్సరం బ్రాండ్ వారంటీతో వస్తుంది.

Tags:    

Similar News