Redmi Note 10: 10 సిరీస్ లో 3 ఫోన్లు రిలీజ్

Redmi Note 10: రెడ్‌మీ ఈ ఏడాది 10 సిరీస్‌లో తొలిసారి మూడు ఫోన్స్‌ను ఇండియాలో విడుదల చేసింది.

Update: 2021-03-04 12:13 GMT

రెడ్‌మీ 10 సిరీస్ ఫోన్లు

Redmi Note 10: రెడ్‌మీ ఈ ఏడాది 10 సిరీస్‌లో తొలిసారి మూడు ఫోన్స్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఈ మూడు మోడల్స్‌లోనూ సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే అలరించనుంది. ఎంఐ.కామ్‌, అమెజాన్‌, ఎంఐ హోమ్‌లో త్వరలో వీటి సేల్స్ మొదలవుతాయి. మరి ఆ మొబైల్స్‌ ఫీచర్లు, ధర తదితర వివరాలు ఓ సారి చూద్దాం..

రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌(Redmi Note 10 Pro Max):

రెడ్‌మీ 10 సిరీస్‌లో ప్రో మ్యాక్స్‌ హై ఎండ్ మోడల్. ఇందులో వెనుకవైపు 108 MP మెయిన్ కెమెరా కాగా, 8 MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5 MP సూపర్‌ మాక్రో లెన్స్‌, 2 MP డెప్త్‌ సెన్సర్‌ ఉన్నాయి. ఇక సెల్పీ ప్రియుల కోసం ముందుభాగంలో 16 MP కెమెరా ఇచ్చారు. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732 జీ ప్రాసెసర్‌, అడ్రినో 618 జీపీయూ ఉంటాయి. బ్యాటరి విషయానికొస్తే..5,020 ఎంఏహెచ్‌ కలిగి ఉంది. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అలాగే డెడికేటెట్‌ మెమొరీ కార్డు స్లాట్‌ ఉంది. మొత్తం మూడు మోడల్స్ ను విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి అందుబాటులోకి వస్తాయి. వాటి ధరలను పరిశీలిస్తే..

6 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ రూ.18,999

6 GB ర్యామ్‌, 128 GB మోడల్‌ రూ.19,999

8 GB ర్యామ్‌, 128 GB మోడల్ రూ.21,999


రెడ్‌మీ నోట్‌ 10 ప్రో (Redmi Note 10 Pro):

రెడ్‌మీ నోట్‌ 10 ప్రోలో వెనుకవైపు 4 కెమెరాలు ఉన్నాయి. 64 MP మెయిన్ కెమెరా కాగా, 8 MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5MP సూపర్‌ మాక్రో లెన్స్‌ 2MP డెప్త్‌ సెన్సర్‌ అందించారు. 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. దీనిలో కూడా క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732 జీ ప్రాసెసర్‌, అడ్రినో 618 జీపీయూ అందించారు. ప్రో మాక్స్ లో లాగే దీనిలో కూడా 5,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ అందించారు. ఈ నెల 17 నుంచి సేల్‌కి వస్తాయి.

6 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్‌ మెమొరీ మోడల్ ధర రూ.15,999

6 GB ర్యామ్‌, 128 GB మోడల్‌ ధర రూ.16,999

8 GB ర్యామ్‌, 128 GB మోడల్ ధర రూ.18,999


రెడ్‌మీ నోట్‌ 10 (Redmi Note 10):

రెడ్‌మీ నోట్‌ 10 వెనుకవైపు 4 కెమెరాలు ఉంటాయి. 48 MP మెయిన్ కెమెరా కాగా, 8 MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2MP మాక్రో లెన్స్‌, 2 MP డెప్త్‌ సెన్సర్‌ ఇస్తున్నారు. 13 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. అయితే దీనిలో మాత్రం క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 678 జీ ప్రాసెసర్‌ అందించారు. అడ్రినో 612 జీపీయూ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ గల ఈ ఫోన్.. 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయి.

4 GB ర్యామ్‌, 64 GB ఇంటర్నల్‌ మెమొరీ మోడల్ ధర రూ.11,999

6 GB ర్యామ్‌, 128 GB మోడల్‌ ధర రూ.13,999 



Tags:    

Similar News