Realme 10 Pro: రియల్‌మి 10 ప్రో స్పెషల్ ఎడిషన్ లాంచ్.. డిజైన్‌, ఫీచర్స్‌ చూస్తే షాక్‌ అవుతారు..!

Realme 10 Pro: రియల్‌మి 10 Pro కోకాకోలా ఎడిషన్ భారతీయ మార్కెట్లో విడుదలైంది.

Update: 2023-02-11 10:41 GMT

Realme 10 Pro: రియల్‌మి 10 ప్రో స్పెషల్ ఎడిషన్ లాంచ్.. డిజైన్‌, ఫీచర్స్‌ చూస్తే షాక్‌ అవుతారు..!

Realme 10 Pro: రియల్‌మి 10 Pro కోకాకోలా ఎడిషన్ భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ ప్రత్యేక ఎడిషన్ వెనుక భాగంలో కోకా-కోలా లోగో ఉంటుంది. అలాగే క్లాసిక్ కోకా-కోలా రింగ్‌టోన్ ఈ పరికరానికి యాడ్‌ చేశారు. ఈ హ్యాండ్‌సెట్ ధర, ఫీచర్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ఈ రియల్‌మి 10 Pro మొబైల్ ఫోన్ 8 GB RAM / 128 GB వేరియంట్ ధర రూ. 20,999. ఫోన్ విక్రయం ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 12 గంటలకు Flipkart, Realme సైట్‌లలో ప్రారంభమవుతుంది. ఫోన్ 6.72-అంగుళాల పూర్తి-HD ప్లస్ స్క్రీన్‌ను 120 Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా కస్టమైజ్ చేసిన కోకాకోలా థీమ్ డిజైన్‌తో ఈ సరికొత్త ఫోన్ లాంచ్ అయింది.

Adreno A619 GPU స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో గ్రాఫిక్స్ కోసం అమర్చారు. 108MP Samsung HM6 ప్రైమరీ సెన్సార్, 2MP పోర్ట్రెయిట్ కెమెరా సెన్సార్ వెనుక భాగంలో ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించారు. అలాగే కెమెరా షట్టర్ సౌండ్ స్థానంలో బాటిల్ ఓపెనింగ్ సౌండ్ వినిపిస్తుంది. ఫోన్‌కు ప్రాణం పోసేందుకు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో కూడిన 5000 mAh బ్యాటరీ ఫోన్‌లో ఉంటుంది.

Tags:    

Similar News