Prasar Bharati OTT App: నెట్‌‌ఫ్లిక్స్, అమెజాన్‌లకు బిగ్ షాక్.. త్వరలో ప్రభుత్వ ఓటీటీ యాప్.. ఇక క్రికెట్, సినిమాలు ఫ్రీ..!

Prasar Bharati OTT App: దేశంలోని పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి తన సొంత ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Update: 2024-08-25 13:18 GMT

Prasar Bharati OTT App

Prasar Bharati OTT App: దేశంలోని పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి తన సొంత ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌ను మొదట జూలై 2024లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే అది తర్వాత వాయిదా పడింది. తర్వాత తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ నెల ప్రారంభంలో ప్రసార భారతి తన ప్లాట్‌ఫామ్‌లో గేమింగ్, OTT, ఎడ్యుకేషనల్ యాప్‌లతో సహా వివిధ అప్లికేషన్‌ల ఇంటిగ్రేషన్ కోసం సడ్మిషన్‌లను ఇన్వైట్ చేసింది.

యాప్‌ను ఇంటిగ్రేటెడ్ చేయడమే కాకుండా ప్రసార భారతి తన OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కోసం లీనియర్ శాటిలైట్ టీవీ ఛానెల్‌లను కూడా చేర్చాలనుకుంటోంది. వినియోగదారులు ప్రతిస్పందన, మార్కెట్ డైనమిక్స్ ఆధారంగా భవిష్యత్తులో మార్పులకు అవకాశం ఉన్న ఈ ఛానెల్‌లు ప్రారంభంలో ఒక సంవత్సరం పాటు చేర్చబడతాయి. ఛానెల్‌లలో నేషనల్ వార్తలు, కరెంట్ అఫైర్స్, జాతీయ, ప్రాంతీయ భాషలలో ఎంటర్‌టైన్మెంట్ ఉంటాయి.

ప్రభుత్వం ఛానెల్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు రెండింటికీ వర్తించే 'కంటెంట్ సోర్సింగ్ పాలసీ' ప్రారంభించింది. దీనిలో కంటెంట్ సోర్సింగ్ పొందడం కోసం ప్రాసెస్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చింది. కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభించడానికి బయట ప్రొడక్ట్స్‌తో పార్ట్నర్‌గా ఉండటానికి ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా క్రికెట్, హాకీ, కబడ్డీ వంటి ప్రధాన క్రీడల హక్కుల కోసం వేలం వేయడానికి, చర్చలు జరపడానికి ప్రసార భారతి క్రీడా హక్కుల చర్చల కమిటీ (SRNC)ని ఏర్పాటు చేసింది.

OTT ప్లాట్‌ఫామ్ రెవెన్యూ షేరింగ్ ఆధారంగా పని చేస్తుంది. దీనిలో కంటెంట్ ప్రొవైడర్‌లు సబ్‌స్క్రిప్షన్ లేదా లావాదేవీ ఆధారిత కంటెంట్ నుండి నికర ఆదాయంలో 65 శాతం పొందుతారు. అయితే ప్రసార భారతి 35 శాతం తన వద్దే ఉంచుకుంటుంది. ప్లాట్‌ఫామ్‌పై వచ్చే శాటిలైట్ ఛానెల్‌లకు కూడా అదే రాబడి షేరింగ్ మోడల్ వర్తిస్తుంది. ప్రసార భారతి OTT ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్ నిర్వహిస్తుంది. ఇందులో విక్రయించబడని ఏదైనా ప్రకటన జాబితా ప్రసార భారతి, ప్రసారకర్తల మధ్య 65:35 నిష్పత్తిలో భాగస్వామ్యం చేయబడుతుంది.

Tags:    

Similar News