Poco C55 Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Poco C55 స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌.. రూ.387కే కొనుగోలు చేసే అవకాశం..!

Poco C55 Flipkart Sale: ప్రముక హ్యాండ్‌సెట్‌ కంపెనీ పోకో గత వారం వినియోగదారుల కోసం పోకో సి 55 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

Update: 2023-02-28 09:13 GMT

Poco C55 Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Poco C55 స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌.. రూ.387కే కొనుగోలు చేసే అవకాశం..!

Poco C55 Flipkart Sale: ప్రముక హ్యాండ్‌సెట్‌ కంపెనీ పోకో గత వారం వినియోగదారుల కోసం పోకో సి 55 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 28, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రారంభమవుతాయి. అయితే భారతదేశంలో Poco C55 ధర, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లు, ఈ హ్యాండ్‌సెట్‌లో ఉన్న ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Poco C55 స్పెసిఫికేషన్‌లు

సాఫ్ట్‌వేర్‌, స్క్రీన్: ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.71-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz టచ్ శాంప్లింగ్ రేట్,534 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్: Poco C55 వేగం, మల్టీ టాస్కింగ్ కోసం MediaTek Helio G85 చిప్‌సెట్‌తో గరిష్టంగా 6 GB RAM, 64 GB వరకు స్టోరేజ్‌ని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజీని 1 TB వరకు పెంచుకోవచ్చు.

కెమెరా: వెనుక ప్యానెల్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు, ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంటుంది.

బ్యాటరీ: 5000 mAh బ్యాటరీ 10W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇచ్చే ఛార్జర్‌ ఉంటుంది.

కనెక్టివిటీ: మైక్రో-USB పోర్ట్, GPS, Wi-Fi, 4G, బ్లూటూత్ వెర్షన్ 5.1 వంటి ఫీచర్లు ఫోన్‌లో అందించారు. భద్రత కోసం ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.

Flipkart ఆఫర్లు

మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసేటప్పుడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా డెబిట్ కార్డ్ ఉపయోగిస్తే 10 శాతం (రూ.1000 వరకు) తక్షణ తగ్గింపును పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్ అందిస్తారు. కస్టమర్ల సౌలభ్యం కోసం నెలకు రూ.1834 నోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఇది కాకుండా ఈఎంఐ ఎంపిక కావాలంటే నెలకు రూ.387 ప్రారంభ EMIతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ప్రయోజనం బ్యాంక్ ఆఫ్ బరోడా 36-నెలల EMI ఎంపికతో అందుబాటులో ఉంది.

భారతదేశంలో Poco C55 ధర

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్, కూల్ బ్లూ అనే మూడు కలర్ వేరియంట్‌లు ఉన్నాయి. ఈ పోకో మొబైల్ 4 GB RAM కలిగిన 64 GB వేరియంట్ ధర రూ.9,499. అదే సమయంలో 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్‌ను కొనుగోలు చేసేందుకు రూ.10,999 వెచ్చించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News