OnePlus 12 Price Cut: మైండ్ బ్లోయింగ్ డీల్.. రూ.69వేల ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్..!

వన్‌ప్లస్ 12 ఆఫర్ల విషయానికి వస్తే కంపెనీ 12 జీబీ + 256 జీబీ ర్యామ్, 16 జీబీ+512 జీబీ ఇంటర్న్లల్ స్టోరేజ్ వేరియంట్లపై భారీ ఆఫర్ ప్రకటించింది.

Update: 2024-08-10 07:17 GMT

OnePlus 12 Price Cut: మైండ్ బ్లోయింగ్ డీల్.. రూ.69వేల ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్..!

OnePlus 12 Price Cut: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన బ్రాండ్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫేమస్ స్మార్ట్‌ఫోస్ 12 ధరను భారీగా తగ్గించింది. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లో వస్తుంది. సమాచారం ప్రకారం కంపెనీ ఈ రెండు వేరియంట్ల ధరలను రూ.5000 వరకు తగ్గించింది. డిస్కౌంట్ తర్వాత ఫోన్‌ను రూ. 59,999కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో 12 జీబీ + 256 జీబీ ర్యామ్, 16 జీబీ+512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. అలానే ఈ ఫోన్‌ను నో కాస్ట్ ఈఎమ్ఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వన్‌ప్లస్ 12 ఆఫర్ల విషయానికి వస్తే కంపెనీ 12 జీబీ + 256 జీబీ ర్యామ్, 16 జీబీ+512 జీబీ ఇంటర్న్లల్ స్టోరేజ్ వేరియంట్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ రెండే వేరియంట్లను ఇప్పుడు రూ.5000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. 12 జీబీ ర్యామ్ అసలు వేరిమంట్ ధర రూ.64,999. అయితే డిస్కౌంట్ తర్వాత రూ.59,999కి కొనుగోలు చేయవచ్చు. 16 జీబీ ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ. 69,999. కానీ ఇప్పుడు రూ. 64,999 మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.7 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఇస్తోంది. మీరు దీన్ని 1 నెల నో-కాస్ట్ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ 12 ఫీచర్ల విషయానికి వస్తే కంపెనీ 3168x1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.82 అంగుళాల 2K OLED ProXDR కర్వ్డ్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్. ఫోన్ 16 జీబీ RAM, 512 GB వరకు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 3ని అందిస్తోంది.

ఫోటోగ్రఫీ కోసం, మీరు ఫోన్ వెనుక ప్యానెల్‌లో LED ఫ్లాష్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ చూస్తారు. వీటిలో 50 మెగాపిక్సెల్ OIS మెయిన్ కెమెరాతో పాటు 64 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ టెలిఫోటో కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం కంపెనీ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌ను పవర్ చేయడానికి దీనిలో 5400mAh బ్యాటరీ ఉంటుందిత. ఈ బ్యాటరీ 100W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. మీరు ఫోన్‌లో 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా చూస్తారు.

Tags:    

Similar News