YouTube: కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్‌.. ఇకపై ఆ ఆటలు సాగవు..!

YouTube: మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో పరిస్థితులు మారిపోయాయి.

Update: 2024-06-25 10:30 GMT

Youtube: కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్‌.. ఇకపై ఆ ఆటలు సాగవు..!

YouTube: మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో పరిస్థితులు మారిపోయాయి. తాజాగా డీప్‌ ఫేక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇతరుల వాయిస్‌, ఫొటోలను ఉపయోగిస్తూ ఫేక్‌ వీడియోలను క్రియేట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పట్లో రష్మిక మందనకు సంబంధించి వచ్చిన ఓ వీడియో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై ఏకంగా భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు.

భారత్‌తో పాటు అగ్రరాజ్యం అమెరికాలో కూడా డీప్‌ ఫేక్‌ వీడియోలు కలకలం రేపాయి. దీంతో ఇలాంటి వీడియోలకు చెక్‌ పెట్టే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్‌ఫామ్‌లో డీప్‌ఫేక్‌ వీడియోలకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేసింది. ఇతరుల వ్యాయిస్‌ను ఏఐ టెక్నాలజీతో వాడుకొని కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్న వారికి చెక్ పెట్టే దిశగా చర్యలు మొదలుపెట్టింది.

అనుమతి లేకుండా యూట్యూబ్‌లో ఇతరుల వాయిస్‌ లేదా ఫొటోను ఉపయోగించి రూపొందించిన కంటెంట్‌ కనిపిస్తే వెంటనే రిపోర్ట్‌ చేసే అవకాశం కల్పించారు. ఇలా యూజర్లు అభ్యర్థిస్తే యూట్యూబ్‌ ఆ వీడియోలను పరిశీలించి, కంటెంట్‌ వాస్తవానికి విరుద్దంగా ఉందా? లేదా ? అనేది యూట్యూబ్ నిర్ధారిస్తుంది. ఒకవేళ అవి డీప్ ఫేక్ వీడియోలే అని తేలితే యూట్యూబ్‌ నేరుగా తొలగిస్తుంది. ఒకవేళ క్రియేటర్లు ఏఐ టెక్నాలజీని ఉపయోగించే వీడియోను రూపొందిస్తే ఆ విషయాన్ని యూజర్లకు తెలియజేయాల్సి ఉంటుందని యూట్యూబ్ తెలిపింది.

Tags:    

Similar News