New SIM Rules: అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధన.. ఈ పని చేయకుంటే 10 లక్షల జరిమానా..!

New SIM Rules: భారత ప్రభుత్వం కొత్త సిమ్‌కార్డుల విషయంలో కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. అక్టోబర్‌ 1 నుంచి ఈ రూల్స్‌ అమలవుతాయి.

Update: 2023-09-05 12:05 GMT

New SIM Rules: అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధన.. ఈ పని చేయకుంటే 10 లక్షల జరిమానా..!

New SIM Rules: భారత ప్రభుత్వం కొత్త సిమ్‌కార్డుల విషయంలో కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. అక్టోబర్‌ 1 నుంచి ఈ రూల్స్‌ అమలవుతాయి. దేశవ్యాప్తంగా సిమ్ కార్డుల వినియోగాన్ని నియంత్రించేందుకు టెలికాం శాఖ (DoT) రెండు సర్క్యులర్‌లను జారీ చేసింది. దీనివల్ల కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు, యాక్టివేషన్ ప్రక్రియలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మొదటి నిబంధన సిమ్ కార్డులను అమ్మే దుకాణాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. షాప్‌లో పనిచేసే వ్యక్తులు సిమ్ కార్డ్ కొనుగోలుదారుని బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఒక్కో దుకాణానికి రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

కొత్త నిబంధనల ప్రకారం టెలి కాం కంపెనీలు తమ వద్ద నమోదు కాని డీలర్ల ద్వారా సిమ్‌ కార్డులు జారీ చేస్తే రూ.10 లక్షల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సిమ్‌ కార్డులు విక్రయించే ప్రస్తుత, భవిష్యత్‌ డీలర్లు ఈ నెలాఖరులోగా టెల్కోల వద్ద నమోదు చేసుకోవాలి. లేదంటే వారికి సిమ్‌ కార్డులు అమ్మే అర్హత ఉండదు. ఒకవేళ అమ్మితే అందుకు టెల్కోలే బాధ్యత వహించాలి. అలాంటి డీలర్ల వద్ద సిమ్‌ కార్డులు తీసుకున్న కస్టమర్ల వివరాలను టెల్కోలు తిరిగి పరిశీలించి నిజమా? కాదా? అని చెక్‌ చేయాలి. అయితే రీచార్జ్‌, బిల్లింగ్‌ సేవలు మాత్రమే అందించే డీలర్లకు మాత్రం ఈ రిజిస్ట్రేషన్‌ వర్తించదు.

ఒకవేళ సిమ్‌కార్డు పోయినట్లయితే..?

పాత సిమ్‌కార్డు పోయినా లేదా పాడైపోయినా కొత్త సిమ్‌ కోసం డీటైల్డ్‌ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త సిమ్ కొనుగోలు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధనల ఉద్దేశ్యం సిమ్‌కార్డులని సురక్షితంగా ఉంచడం, మోసగాళ్లు ఫోన్‌ను యాక్సెస్ చేయకుండా నిరోధించడం. అదనంగా, అస్సాం, కాశ్మీర్, నార్త్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లోని టెలికాం ఆపరేటర్లు సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలపై పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాలని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది.

Tags:    

Similar News