Mini Laptops: మినీ ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు సూపర్ జర్నీలో సౌకర్యవంతం..!
Mini Laptops: ఈ రోజుల్లో మార్కెట్‌లో మినీ ల్యాప్‌టాప్‌లకి డిమాండ్ పెరిగింది.
Mini Laptops: ఈ రోజుల్లో మార్కెట్‌లో మినీ ల్యాప్‌టాప్‌లకి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే అద్భుతమైన ఫీచర్లు సరసమైన ధరలలో లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిని ఎక్కడి నుంచైనా సులభంగా వినియోగించవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ల స్క్రీన్ పరిమాణం 14-అంగుళాల కంటే తక్కువగా ఉంటుంది. ఇవి పెద్ద ల్యాప్‌టాప్‌లు చేసే అన్ని పనులు చేయగలవు. ఈ పరిస్థితిలో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న 4 మినీ ల్యాప్‌టాప్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. Jio Book 11 (2023)
Jio Book 11 అనేది భారతీయ బ్రాండ్. శక్తివంతమైన కాంపాక్ట్ ల్యాప్‌టాప్. ఇది MediaTek ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB RAM, 64GB eMMC స్టోరేజ్‌ను అందిస్తుంది. వినియోగదారులు ఇన్ఫినిటీ కీబోర్డ్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 4G LTE కనెక్టివిటీని పొందుతారు. దీని తేలికపాటి డిజైన్, యాంటీ-గ్లేర్ HD డిస్‌ప్లే, 8+ గంటల బ్యాటరీ లైఫ్ మీకు ప్రయాణంలో మంచి అనుభవాన్ని అందిస్తుంది.
2. HP Chromebook 11a
HP Chromebook 11aలో వినియోగదారులు MediaTek MT8183 ప్రాసెసర్, 4GB RAM, రెస్పాన్స్‌డ్ టచ్‌స్క్రీన్‌ను పొందుతారు. దీని తేలికపాటి డిజైన్, Chrome OSతో ఎటువంటి అంతరాయం లేకుండా బ్రౌజింగ్, మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా వినియోగదారులు యాంటీ గ్లేర్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, గూగుల్ అసిస్టెంట్‌తో సహా అనేక ఫీచర్లను పొందుతారు.
3. Lenovo IdeaPad Slim 3 Chromebook
Lenovo IdeaPad Slim 3 Chromebookతో పని చేస్తుంది. దీని Intel Celeron N4020 ప్రాసెసర్, 4GB RAM, 64GB eMMC స్టోరేజ్ మీ పనులను వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతాయి. దీని 11.6 అంగుళాల డిస్‌ప్లేలో వినియోగదారులు తమ పనిని సులభంగా పూర్తి చేయవచ్చు. దీని బరువు 1.12 కిలోలు. ఇది స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. ప్రయాణంలో దీన్ని వాడినప్పుడు భిన్నమైన అనుభవం పొందుతారు.
4. Acer TravelMate
Acer TravelMate బిజినెస్ ల్యాప్‌టాప్ ఇంటెల్ పెంటియమ్ N5030 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో వినియోగదారులు 11.6 అంగుళాల HD డిస్ప్లే, 4 GB DDR4, 128 GB SSD వంటి గొప్ప ఫీచర్లను పొందుతారు. అంతేకాకుండా స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్‌ను పొందుతారు. ఈ ల్యాప్‌టాప్ చూడటానికి స్లిమ్‌గా స్టైలిష్‌గా ఉంటుంది.