Microsoft: మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య.. ప్రపంచవ్యాప్తంగా విండోస్‌ సేవల్లో అంతరాయం

Microsoft Cloud Outage: మైక్రోసాఫ్ట్... సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి.

Update: 2024-07-19 07:56 GMT

Microsoft: మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య.. ప్రపంచవ్యాప్తంగా విండోస్‌ సేవల్లో అంతరాయం

Microsoft Cloud Outage: మైక్రోసాఫ్ట్... సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ ఒక అప్డేట్‌ను విడుదల చేసింది. దాని తర్వాత MS Windowsలో నడుస్తున్న అన్ని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అకస్మాత్తుగా క్రాష్ అవుతున్నాయి. పని చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్‌లు షట్ డౌన్ అవుతున్నాయి. దీని తర్వాత వినియోగదారులు బ్లూ స్క్రీన్‌ను చూస్తున్నారు.

మీ కంప్యూటర్ సమస్యలో ఉందని, రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్క్రీన్ చెబుతోంది. ఈ ప్రక్రియనే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ BSODఅంటారు. ఈ సమస్య కారణంగా, మైక్రోసాఫ్ట్ విండోస్‌లో నడుస్తున్న ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి. క్రౌడ్‌ స్ట్రైక్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.

భారత్‌ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి. 

Tags:    

Similar News