Mi Tv 4a 40: ఎంఐ కొత్త టీవీ.. లాంచ్ ఎప్పుడంటే?
Mi Tv 4a 40: ఎంఐ మరో కొత్త టీవీని లాంఛ్ చేయనుంది. జూన్ 1న విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది.
Mi Tv 4a 40: ఎంఐ మరో కొత్త టీవీని లాంఛ్ చేయనుంది. జూన్ 1న విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. ఎంఐ టీవీ 4ఏ 40 హారిజన్ ఎడిషన్ పేరుతో రానుంది. 2019 లో విడుదలైన ఎంఐ టీవీ 4ఏకి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రానుంది.
ఎంఐ టీవీ 4ఏ 40 హారిజన్ ఎడిషన్ విడుదలను కన్‌ఫాం చేస్తూ.. #MiTV4A40, #HorizonEdition హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్ చేసింది. రానున్న టీవీలో అంచులు ఉండని డిజైన్‌ను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ టీవీ ఫొటోని కూడా కంపెనీ షేర్ చేసింది.
ఎంఐ టీవీ 4ఏకు మూడు వైపున అంచులు లేవు. కింద భాగంలో ఎంఐ లోగో కనిపిస్తుంది. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 2019 ఎంఐ టీవీ 4ఏ తరహాలోనే దీని ఫీచర్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్, ప్యాచ్ వాల్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నట్లు టాక్. డీటీఎస్ హెచ్‌డీ సపోర్ట్ ఉన్న 20W స్పీకర్లతో రానున్నట్లు సమాచారం.
ఎంఐ టీవీ 4ఏ 40 ధర, డిజైన్, స్పెసిఫికేషన్ పూర్తి వివరాలు జూన్ 1న తెలియనున్నాయి. కాగా, లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తారో, లేదా మార్కెట్లోకి నేరుగా విడుదల చేస్తారో ట్వీట్ లో తెలియజేయలేదు.