Mi 11 Lite 4G: ఎంఐ 11 లైట్ 4G వచ్చేస్తుంది!
Mi 11 Lite 4G: ఎంఐ 11 లైట్ 4జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు షియోమీ టీజ్ చేసింది.
Mi 11 Lite 4G: ఎంఐ 11 లైట్ 4జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు షియోమీ టీజ్ చేసింది. ఎంఐ 11 లైట్ 5జీతో పాటు 4జీ కూడా గ్లోబల్ మార్కెట్లలో విడుదలైంది. ఈ మేరకు షియోమీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్ ఫోన్ పేర్ చెప్పకుండా ట్వీట్ చేశాడు. అలాగే షియోమీ మార్కెటింగ్ లీడ్ సుమిత్ సోనాల్ కూడా ట్వీట్ చేశాడు.
ఈ ఫోన్ ధర 299 యూరోలుగా(సుమారు రూ.25,600) ఉంది. బ్లాక్, పింక్, బ్లూ కలర్లల్లో ఈ ఫోన్ లభిస్తోంది. మనదేశంలో రూ.20 వేలలోపే ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు.
ఇక ఫోన్ ఫీచర్లు చూస్తే.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.55 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేతో రానుంది. అలాగే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో రానుంది. హెచ్‌డీఆర్10 సపోర్ట్ తోపాటు ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉన్నాయి. వీటిలో మెయిన్ కెమెరా 64 MP కాగా, దీంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 MP మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు 16 MP కెమెరాను అందించారు.
4250 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న ఈ ఫోన్ 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, జీపీఎస్, వైఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అలరించనున్నాయి.