SmartPhone: మీ ఫోన్ చోరీకి గురైందా? కంగారు పడకండి.! ఇలా కనిపెట్టొచ్చు
Smart Phone: ప్రతి Android స్మార్ట్‌ఫోన్‌తో ఈ సేవ అందించబడుతుంది
SmartPhone: ఆరచేతిలోనే ప్రపంచాన్ని చూపించే స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర సర్వాసాధారణం. స్మార్ట్ ఫోన్స్ లో అన్ని విశేషాలు తెలుసుకోవడంతోపాటు ఎంటర్ టైన్మెంట్ సాధనంగా కూడా ప్రజలు ఉపయోగిస్తారు. ఒక్క క్షణం ఇదీ లేకపో్యినా విలవిల్లాడిపోతారు. అటువంటి స్మార్ట్ ఫోన్ చోరీకి గరైనా.. పోగొట్టుకోవడం వంటి విషయం వారికీ నిద్రలేని రాత్రులు మిగిలిస్తుంది. అయితే మీకో గుడ్ న్యూస్ ఫోన్ చోరీకి గురైనా.. పోయినా కంగారు పడొద్దు. కొన్ని ఉత్తమమైన మార్గాల ద్వారా వెంటనే కనిపెట్టే ప్రయత్నాలు చెయ్యొచ్చు. మీ ఫోన్‌ను ఎక్కడ ఉందో కనిపెట్టగలిగే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయని అనుకోవద్దు. మీ ఫోన్ ట్రాక్ చేసి ఎక్కడ ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
ముందుగా మీ అండ్రాయిడ్ ఫోన్ లో Google అందించే ఒక ఫీచర్ Find My Device(ఫైండ్ మై డివైస్) ఉండాలి. ప్రతి Android స్మార్ట్‌ఫోన్‌తో ఈ సేవ అందించబడుతుంది. పోగొట్టుకున్న వారి ఫోన్‌లు, టాబ్లెట్ వస్తువులను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. మీమొబైల్ లో Google అకౌంట్ లో సైన్ ఇన్ చేసి ఉంటే, Find My Device అప్రమేయంగా ప్రారంభించబడుతుంది. మీ ప్రైవేట్ డేటాను సురక్షితంగా ఉంచడానికి చివరి సహాయంగా స్మార్ట్ ఫోన్ లేదా డివైజ్ ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ఒక ఎంపికను అందిస్తుంది.
*మీ Google ఖాతాతో Find My Device సర్వీస్ లోకి లాగిన్ అవ్వండి.
*మీరు ఒకే ఇమెయిల్‌తో చాలా ఫోన్లను నమోదు చేసుకుంటే ఆ ఫోన్ల నుంచి మీకు కావలసిన ఫోన్ను ఎంచుకోవడానికి డాష్‌బోర్డ్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
*Find My Device మీ ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి, మ్యాప్‌లో దాని లొకేషన్ చూపించడానికి ప్రయత్నిస్తుంది.
*మీ ఫోన్‌ను ట్రాక్ చేయడాన్ని నిర్వహిస్తుంది, ఇది మీకు ఎంచుకోవడానికి మూడు ఎంపికలను అందిస్తుంది - సౌండ్ ప్లే, సెక్యూర్ డివైజ్, ఎరేజ్ డేటా.
*మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ, మీరు సమీపంలో ఉంటే దాన్ని గుర్తించడానికి లేదా ఇతరులను అప్రమత్తం చేయడానికి ఐదు నిమిషాలు రింగ్ అవుతుంది.
*అదనంగా, మీరు ఫోన్‌ను లాక్ చేయడం ద్వారా దాన్ని సెక్యూర్ చెయ్యవచ్చు
*ఫోన్ మరెవరికైనా దొరికితే మెసేజ్ ద్వారా వారికీ తెలియచేయవచ్చు.
*Google ఖాతా నుంచి సైన్-అవుట్ చేసిన తర్వాత కూడా ఫోన్ లొకేషన్ మ్యాప్‌లో చూపబడుతుంది.
*ఇక చివరగా, పోగొట్టుకున్న ఫోన్‌ను కనుగొనడం చాలా కష్టంగా మారితే మీ ఫోన్ లో వున్న విలువైన డేటా డిలీట్ తొలిగించవచ్చు.