Spam Calls: స్పామ్‌ కాల్స్‌ భరించలేకపోతున్నారా.. ఈ చిన్న ట్రిక్ ప్లే చేయండి..!

Spam Calls: స్పామ్‌ కాల్స్‌ భరించలేకపోతున్నారా.. ఈ చిన్న ట్రిక్ ప్లే చేయండి..!

Update: 2022-10-30 13:31 GMT

Spam Calls: స్పామ్‌ కాల్స్‌ భరించలేకపోతున్నారా.. ఈ చిన్న ట్రిక్ ప్లే చేయండి..!

Spam Calls: ఈ రోజుల్లో స్పామ్‌ కాల్స్‌ పెద్ద తలనొప్పిగా మారాయి. బిజీగా ఉండే సమయంలో కాల్స్‌ చేసి విసిగిస్తారు. రెస్పాండ్ కాకపోతే మళ్లీ మళ్లీ చేసి ఇబ్బంది పెడుతారు. ఈ రోజుల్లో ఈ సమస్య విపరీతంగా పెరిగింది. వాస్తవానికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్‌ చేసుకోవాలనుకున్నా, ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలన్నా వ్యక్తిగత ఫోన్‌ నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఈ నెంబర్లని ఆసరాగా చేసుకొని తరచూ ఫోన్ కాల్స్‌ చేసి విసిగిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం.

స్పామ్‌ కాల్స్‌ ద్వారా చాలామంది మోసపోయారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులలని టార్గెట్ చేస్తారు. తరచుగా కాల్స్‌ చేస్తూ వినియోగదారులని తప్పు దారి పట్టిస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత లోన్స్‌, జాబ్‌ ఆఫర్స్‌ అంటూ యువతకి గాలం వేస్తుంటారు. ఇలాంటి కాల్స్‌ రావొద్దంటే ఆండ్రాయిడ్‌ ఓ సెక్యూరిటీ ఫీచర్‌ను అందించింది. కానీ ఇది చాలామందికి తెలియదు. ఇందులో భాగంగా కాలర్‌ ఐడీ, స్పామ్‌ ప్రొటెక్షన్‌ అనే రెండు ఫీచర్లను గూగుల్‌ అందిస్తోంది. వీటి ద్వారా స్పామ్‌ కాల్స్‌ బెడద నుంచి తప్పించుకోవచ్చు.

ముందుగా ఫోన్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. అందులో కాలర్‌ ఐడీ అండ్ స్పామ్‌ ప్రొటెక్షన్ ఆప్షన్‌ను ఎంచుకొని ఎనేబుల్ నొక్కాలి. తర్వాత అగ్రీ బటన్‌పై క్లి్‌క్‌ చేస్తే కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌ ప్రొటెక్షన్ యాక్టివేట్ అవుతుంది. ఇక మరొక పద్దతిలో

ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి కింద ఉన్న రీసెంట్స్‌ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు వచ్చిన స్పామ్‌ కాల్‌ నంబర్‌పై క్లిక్ చేస్తే ఫోన్‌, మెసేజ్‌, వీడియో, ఐ అని ఐకాన్స్‌ కనిపిస్తాయి. వాటిలో ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. స్పామ్‌ కాల్‌ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్‌ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆ నెంబర్ నుంచి కాల్స్‌ రాకుండా ఉంటాయి.

Tags:    

Similar News