Twitter: ట్విట్టర్ కి హైకోర్టు బిగ్ షాక్.. 50 లక్షల పెనాల్టీ.. ఎందుకంటే..?

Twitter: ట్విట్టర్‌ సంస్థ‌కు కర్ణాటక హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది.

Update: 2023-07-01 06:25 GMT

Twitter: ట్విట్టర్ కి హైకోర్టు బిగ్ షాక్.. 50 లక్షల పెనాల్టీ.. ఎందుకంటే..?

Twitter: ట్విట్టర్‌ సంస్థ‌కు కర్ణాటక హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రైతుల నిరసనలు, కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని అకౌంట్లు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేసినందుకు కర్ణాటక హైకోర్టు ట్విట్టర్‌కు రూ.50 లక్షల జరిమానా విధించింది. 2021 ఫిబ్ర‌వ‌రి నుంచి 2022 మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం ప‌దిసార్లు ట్విట్ట‌ర్‌ను బ్లాక్ చేయాల‌ని ఆదేశించినట్లు ట్విట్ట‌ర్ త‌న పిటీష‌న్‌లో పేర్కొన్న‌ది. మ‌రో 39 యూఆర్ఎల్స్‌ను కూడా తీసివేయాల‌ని కేంద్ర ఐటీశాఖ ఆదేశించింది.

అయితే ఆ ఆదేశాల‌ను త‌ప్పుప‌డుతూ ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను జ‌స్టిస్ కృష్ణ దీక్షిత కొట్టిపారేశారు. ఆ సంస్థ‌పై 50 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విట్ట‌ర్‌ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సంతోషం వ్యక్తం చేస్తూ అన్ని ప్లాట్‌ఫారమ్‌లు భారతీయ చట్టానికి అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కానీ జాక్‌ నేతృత్వంలోని ట్విట్ట‌ర్‌ పదే పదే ఉల్లంఘించిందని ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News