Mobile Touch Screen: మీ మొబైల్ టచ్ స్క్రీన్ పనిచేయడం లేదా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!
Mobile Touch Screen: ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు ప్రపంచం మొత్తం మీ జేబులో ఉన్నట్లే.
Mobile Touch Screen: ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు ప్రపంచం మొత్తం మీ జేబులో ఉన్నట్లే. అంతలా మారిపోయింది ప్రపంచం. ఏ పని చేయాలన్నా స్మార్ట్‌పోన్ తో సులభంగా చేయవచ్చు. అందుకే మార్కెట్లో ప్రతిరోజు కొత్త కొత్త మొబైల్స్ వస్తూనే ఉంటాయి. ఇది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయంది. అందుకే ఎల్లప్పుడు వీటికి డిమాండ్ ఉంటుంది. అయితే ఇలాంటి ఫోన్లు ఒక్కోసారి చాలా సమస్యలు సృష్టిస్తాయి. ముఖ్యంగా అత్యవసర సమయంలో టచ్ స్కీన్ పనిచేయకుండాపోతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం.
1. ముందుగా డివైస్‌ను టర్నాఫ్ చేసి కొద్ది సెకన్ల తరువాత తిరిగి మళ్లి ఆన్ చేయండి. ఇలా చేయటం వల్ల టచ్ స్ర్కీన్ కు సంబంధించి సాఫ్ట్ వేర్ సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి.
2. అయినా పనిచేయకుంటే ఫోన్ లోని సిమ్ ఇంకా మెమరీ కార్డ్ లను తొలగించి కొద్ది సెకన్ల తరువాత మరలా వాటిని అమర్చి ఫోన్ ను ఆన్ చేసి చూడండి.
3. ఒక్కోసారి ఫోన్ డాక్యుమెంటేషన్‌లో కూడా సమస్య ఉంటుంది. అక్కడ పరిశీలిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉంటాయి.
4. టచ్ పనిచేయనప్పుడు ఒక్కోసారి మీ డివైస్ సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసి చూడండి.
5. చివరి ప్రయత్నంగా ఫోన్‌ను రీసెట్ చేయండి. అయినా పనిచేయకపోతే టచ్ పాడైపోయినట్లే. వెంటనే సర్వీస్ సెంటర్‌కి వెళ్లాల్సిందే.