5G Smartphone: 8 నిమిషాల్లో 50% ఛార్జ్.. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్.. క్వాలిటీ ఫీచర్లతో కేక పుట్టిస్తోన్న ఫోన్.. ధర ఎంతంటే?
IQoo Neo 7 Pro 5G: చైనీస్ టెక్ కంపెనీ iQoo 'iQoo Neo 7 Pro 5G' స్మార్ట్‌ఫోన్‌ను జులై 4న భారతదేశంలో విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియాలో స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది.
IQoo Neo 7 Pro 5G: చైనీస్ టెక్ కంపెనీ iQoo 'iQoo Neo 7 Pro 5G' స్మార్ట్‌ఫోన్‌ను జులై 4న భారతదేశంలో విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియాలో స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది. టీజర్‌లో, కంపెనీ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను ఆవిష్కరించింది. ఫోన్ వెనుక ప్యానెల్ లెదర్, నారింజ రంగులో కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ iQoo Neo 7 Pro 5Gని బ్లాక్ కలర్ ఆప్షన్‌లో కూడా అందించగలదని అంటున్నారు.
ఇప్పటివరకు కంపెనీ ఫోన్ స్పెసిఫికేషన్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, మీడియా నివేదికలు స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి చాలా వివరాలను వెల్లడించాయి. ఈ నివేదికల ప్రకారం స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
iQoo Neo 7 Pro 5G: స్పెసిఫికేషన్‌లు..
డిస్ప్లే: iQoo Neo 7 Pro 5Gలో కంపెనీ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను అందించగలదు. డిస్‌ప్లే రిజల్యూషన్ 2400x1080 పిక్సెల్‌లుగా ఉంటుంది.
హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్: పనితీరు కోసం ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Plus Gen 1 ప్రాసెసర్‌ని అందించారంట. Android 13 ఆధారిత Funtouch ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది.
కెమెరా: ఫోటోగ్రఫీ కోసం, iQoo Neo 7 Pro 5G 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో విడుదల కానుంది. అదే సమయంలో, సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం పంచ్ హోల్ డిజైన్‌తో 16 MP ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
బ్యాటరీ, ఛార్జింగ్: పవర్ బ్యాకప్ కోసం, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 5000 mAh బ్యాటరీని అందించవచ్చు. మీడియా రిపోర్ట్‌ల మేరకు, 120W ఫాస్ట్ ఛార్జర్‌తో ఫోన్ బ్యాటరీ 8 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుందంట.
కనెక్టివిటీ ఎంపికలు: కనెక్టివిటీ కోసం, ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 6, స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో, GPS, బ్లూటూత్, NFCలను పొందవచ్చు.
iQoo Neo 7 Pro 5G: అంచనా ధర..
మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ iQoo Neo 7 Pro 5Gని భారతదేశంలో ప్రారంభ ధర రూ. 38,000లు ఉంటుందని చెబుతున్నారు.