6G India: 6జీ టైమ్ ఆగయా.. ఇక నుంచి బుల్లెట్ స్పీడ్‌తో ఇంటర్నెట్.. లాంచ్ ఎప్పుడండే..?
6G India: 6జీని ప్రారంభించే విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేలా మొదటిగా ప్రారంభించాలని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపాడు.
6G India: 5G ప్రారంభించిన తర్వాత 6G కోసం ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది. ఈ విషయంలో అగ్రగామిగా ఎదగడానికి భారతదేశం 6Gని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టిఎస్‌పి)పై ఇటీవల ఏర్పాటు చేసిన స్టేక్‌హోల్డర్ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఎసి)తో కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని రెండో సమావేశాన్ని నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
దేశంలో 5G నెట్‌వర్క్ పూర్తిగా సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. Jio, Airtel దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చాయి. Vodafone-Idea , BSNL త్వరలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ముందుగా 6Gని ప్రారంభించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, BSNL వంటి టెలికాం కంపెనీల నుండి 6G సేవలను అభివృద్ధి చేయాలని పట్టుబట్టడానికి కారణం ఇదే.
గత శుక్రవారం టెలికాం ఆపరేటర్లతో జరిగిన రెండవ సలహా కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అక్కడ 6G టెక్నాలజీ అభివృద్ధిలో ముందడుగు వేయాలని కోరారు. భారతదేశంలో 6జీ గురించి గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతదేశం టెక్నాలజీ రంగంలో చాలా వేగంగా పనిచేస్తోందని, దేశం త్వరలో 6Gలోకి ప్రవేశించబోతోందని ప్రధాని మోదీ అన్నారు.
PM మోడీ ప్రకటన తర్వాత జ్యోతిరాదిత్య 6Gని ప్రారంభించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తద్వారా భారతదేశంలో 6Gని మొదట ప్రారంభించవచ్చు. ఇంటర్నెట్‌లోని సమాచారం టెలికాం ఆపరేటర్లు సమావేశంలో రైట్ ఆఫ్ వే అనుమతులను సరళీకృతం చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు విద్యుత్ రేట్లు, లెవీ తగ్గింపు డిమాండ్‌పై కూడా దృష్టి సారించారు.
భారతదేశంలో 6G సేవను ప్రారంభించడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. తద్వారా 6G హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురావచ్చు. భారతదేశం అత్యంత వేగంగా 5Gని విడుదల చేస్తున్న దేశం. భారతదేశం 5G, 6G నెట్‌వర్క్‌లను ఫూల్‌ప్రూఫ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే స్వదేశీ సాంకేతికతను ఇందులో ఉపయోగించాలి. అందుకే 6జీ సెమీకండక్టర్లను దేశీయంగానే తయారు చేయాలని భారత్ తెలిపింది.