వాషింగ్ మెషీన్‌పై భారీ తగ్గింపు.. కేవలం రూ.4290కే కొనుగోలు చేసే అవకాశం..!
Washing Machine Discount: మీరు తక్కువ ధరలో వాషింగ్ మెషీన్ కొనాలంటే ఇది మంచి సమయమని చెప్పవచ్చు.
Washing Machine Discount: మీరు తక్కువ ధరలో వాషింగ్ మెషీన్ కొనాలంటే ఇది మంచి సమయమని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం రూ.5000లోపు వాషింగ్ మెషీన్ ఇంటికి తీసుకురావొచ్చు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అందరి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. ONIDA 9 కిలోల వాషింగ్ మెషీన్ తెలుపు, మెరూన్ రంగులలో లభిస్తుంది. ఇందులో ఒకేసారి చాలా బట్టలు ఉతకవచ్చు. దీని డిస్కౌంట్, ఆఫర్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.7050గా ఉంది. దీపావళి ఆఫర్ ముగిసిన తర్వాత వినియోగదారులకు ఈ వాషింగ్ మెషీన్‌పై 7 శాతం బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో ధర గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు ఈ వాషింగ్ మెషీన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6490కి జాబితా చేశారు. కస్టమర్‌లు ఈ సరసమైన మొత్తాన్ని చెల్లించడం ద్వారా దీనిని ఇంటికి తీసుకెళ్లవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ముగిసిపోవడం లేదు. మరో బలమైన ఆఫర్‌ను దీనికి జత చేశారు.
ఎక్స్ఛేంజ్ బోనస్
రూ. 6490 విలువైన ఈ శక్తివంతమైన వాషింగ్ మెషీన్‌పై కస్టమర్‌లకు రూ.2200 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా అందిస్తున్నారు. మీరు ఇంట్లో పడి ఉన్న పాత వాషింగ్ మెషీన్‌ను మార్చుకోవాలనుకుంటే రూ.2200 ఎక్స్ఛేంజ్ బోనస్‌ని పొందుతారు. ఇది జాబితా చేయబడిన ధర నుంచి తీసవేస్తారు. ఆ తర్వాత కస్టమర్‌లు ఈ వాషింగ్ మెషీన్‌ను కేవలం రూ.4290కే కొనుగోలు చేయవచ్చు.