WiFi Radiation: వైఫై వాడుతున్నారా.. రేడియేషన్ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందంటే..?

WiFi Radiation: ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ ఉపయోగించడానికి ప్రతి ఒక్కరు వైఫై వాడుతున్నారు.

Update: 2023-07-31 04:41 GMT

WiFi Radiation: వైఫై వాడుతున్నారా.. రేడియేషన్ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందంటే..?

WiFi Radiation: ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ ఉపయోగించడానికి ప్రతి ఒక్కరు వైఫై వాడుతున్నారు. ఇది ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన పరికరాల మధ్య వైర్‌లెస్‌గా డేటాను ప్రసారం చేస్తుంది. అలాగే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు మొదలైన పరికరాల మధ్య డేటాను షేర్‌ చేయడానికి రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది. అయితే దీనివల్ల రేడియేషన్ విడుదలవుతుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. కానీ ఎంత మొత్తంలో రేడియేషన్‌ విడుదలవుతుందో ఈరోజు తెలుసుకుందాం.

సాధారణంగా ఇంటర్నెట్ సేవను వైర్‌లెస్‌గా ఉపయోగించడం వల్ల రేడియేషన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్నిచూపదు. అయితే కార్యాలయంలో, ఇంట్లో నిరంతరం వైఫైతో పనిచేస్తుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీన్ని నివారించాలంటే రూటర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలను దానికి దూరంగా ఉంచాలి. చాలా సంస్థలు వై ఫై రేడియేషన్‌ను సురక్షితంగా భావించాయి. అయినప్పటికీ కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

వైఫై హాని..?

కొన్ని పరిశోధనలలో వై ఫై రేడియేషన్ వల్ల నిద్ర సమస్యలు ఎదురవుతాయని తేలింది. మరికొన్ని పరిశోధనలలో డీఎన్‌ఏకి హాని కలిగిస్తుందని తేలింది. ఇది సెల్ డ్యామేజ్‌కు కారణమవుతుంది. అలాగే వైఫై రేడియేషన్‌ వల్ల కొందరికి చర్మ సమస్యలు ఏర్పడుతాయి. అయినప్పటికీ రాత్రిపూట వై ఫై ఆఫ్ చేస్తే బెటర్‌. తద్వారా దీని ప్రభావాన్ని మరింత తగ్గించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వైఫై రేడియేషన్‌ను అధ్యయనం చేసి దీని స్థాయి చాలా తక్కువగా ఉంటుందని ఇది మానవ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం కలిగించదని తెలిపింది.

Tags:    

Similar News