Spam Call: స్పామ్‌ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.? ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి..

Spam Call: మొబైల్‌ ఫోన్‌ ఉన్న దాదాపు ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్యల్లో స్పామ్‌ కాల్స్‌ ఒకటి.

Update: 2024-07-10 10:57 GMT

Spam Call: స్పామ్‌ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.? ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి.. 

Spam Call: మొబైల్‌ ఫోన్‌ ఉన్న దాదాపు ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్యల్లో స్పామ్‌ కాల్స్‌ ఒకటి. పర్సనల్‌ లోన్స్‌ కోసం అని, క్రెడిట్‌ కార్డ్‌ల కోసమని రకరకాల ఫోన్‌ కాల్స్‌ వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వీటివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక కొందరు సైబర్‌ నేరస్థులు మోసపూరిత కాల్స్‌ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఉదాహరణలు కూడా చూస్తున్నాం. అయితే ఇలాంటి స్పామ్‌ కాల్స్‌కు అడ్డుకట్ట వేయలేమా.? అంటే కచ్చితంగా వేయొచ్చు. మన ఫోన్‌లోనే కొన్ని ఫీచర్లతో ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

♦ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్‌లను ఉపయోగించేవారు స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు ముందుగా.. గూగుల్‌ ఫోన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనంతరం ఇందులో చూపించిన విధంగా డిఫాల్ట్‌ డైలర్‌ను సెట్‌ చేసుకోవాలి. తర్వాత యాప్‌ను మళ్లీ ఓపెన్‌ చేయాలి. యాప్‌లో కనిపించే మూడు చక్కలను సెలక్ట్ చేసుకొని సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం అందులో ఉన్న ‘కాలర్‌ ఐడీ అండ్‌ స్పామ్‌’ను నొక్కాలి. తర్వాత ఎనేబుల్‌ ఫిల్టర్‌ స్పామ్‌ కాల్స్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో ఇకపై ఎలాంటి అనుమానిత కాల్స్‌ వచ్చినా వెంటనే దానంతటదే అడ్డుకుంటుంది.

♦ ఇక ఐఫోన్‌ యూజర్ల విషయాకొస్తే ఇందులో ట్రూకాలర్‌ వంటి యాప్స్‌తో స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టొచ్చు. ఇందుకోసం ముందుగా ట్రూకాలర్‌ లాంటి కాల్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత సెటింగ్స్‌ ద్వారా ఫోన్‌ విభాగంలోకి వెళ్లి కాల్‌ బ్లాకింగ్‌ అండ్‌ ఐడెంటిఫికేషన్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇందులో కనిపించే నాలుగు ఆప్షన్స్‌ను ఆన్‌ చేసుకోవాలి. అనంతరం ట్రూకాలర్‌ యాప్‌ను తిరిగి ఓపెన్ చేసి స్పామ్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. అయితే ఇది కాల్స్‌ను నివారించదు కానీ డేటాబేస్‌తో ఫోన్‌ నంబరును పోల్చి స్పామ్‌ కాల్‌ అవునో కాదో అనే విషయాన్ని తేల్చేస్తుంది.

Tags:    

Similar News