Helmet Buying Tips: బైక్ రైడర్లకు హెల్మెట్ మస్ట్.. కొనేముందు ఈ విషయాలు చెక్ చేయండి..!

Helmet Buying Tips: బైక్ రైడర్స్ కచ్చితంగా హెల్మెట్ వాడాలి. అది నాణ్యమైనదిగా ఉండాలి. నేటి రోజుల్లో చాలామంది ఏదో హెల్మెట్ వాడామంటే వాడుతున్నారు.

Update: 2024-05-27 03:15 GMT

Helmet Buying Tips: బైక్ రైడర్లకు హెల్మెట్ మస్ట్.. కొనేముందు ఈ విషయాలు చెక్ చేయండి..!

Helmet Buying Tips: బైక్ రైడర్స్ కచ్చితంగా హెల్మెట్ వాడాలి. అది నాణ్యమైనదిగా ఉండాలి. నేటి రోజుల్లో చాలామంది ఏదో హెల్మెట్ వాడామంటే వాడుతున్నారు. దానికి కనీసం ఐఎస్ఐ మార్క్ కూడా ఉండడం లేదు. రోడ్డు పక్కన అమ్ముతున్న వారి దగ్గర ఎక్కువ తీసుకుంటున్నారు. ఇలాంటి హెల్మెట్లు వాడినా ఒక్కటే వాడకున్నా ఒక్కటే. హెల్మెట్ కొనుగోలు విషయంలో చాలామంది డబ్బుల గురించి ఆలోచించి నాణ్యమైనది తీసుకోవడం లేదు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాణం విలువ హెల్మెట్ కంటే చాలా ఎక్కువ. అందుకే ఒక్కసారి తీసుకునే హెల్మెట్ నాణ్యమైనదిగా, ధరించడానికి అనువైనదిగా ఉండే విధంగా చూసుకొని తీసుకోవాలి. ఈ రోజు హెల్మెట్ కొనేటప్పుడు ఎలాంటి విషయాలు గమనించాలో తెలుసుకుందాం.

కొత్త హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు మొదట చూడవలసిన విషయం పరిమాణం. హెల్మెట్ ఆకారం, పరిమాణం మీ ముఖానికి తగిన విధంగా ఉండాలి. బైక్, -స్కూటర్‌ నడుపుతున్నప్పుడు తలపై భారంగా భావించే హెల్మెట్‌ను కొనుగోలు చేయవద్దు. హెల్మెట్ ధరించేటప్పుడు, తీసేటప్పుడు ముఖం, తలపై ఒత్తిడి పడకూడదు. హెల్మెట్ ప్రమాదం తర్వాత మిమ్మల్ని రక్షించే విధంగా తయారై ఉండాలి. ఇందులో కుషన్ ప్రమాదం జరిగినప్పుడు ఒత్తిడిని తట్టుకునే విధంగా ఉండాలి. ఇది మీ బుగ్గలు, ముఖంలోని ఇతర భాగాలను పాడు చేయకుండా ఉండాలి.

విజర్స్ అనేది చాలా ముఖ్యమైన భాగం. మీరు పొగ, ఆవిరిని నివారించాలి. ఇది రాత్రి, వర్షం సమయంలో సరిగ్గా పనిచేయాలి. పగలు, రాత్రి స్పష్టంగా చూడగలిగే విధంగా ఉండేది చూస్ చేసుకోవాలి. భారతదేశంలో ISI ధృవీకరించిన హెల్మెట్‌ను ఉపయోగించడం తప్పనిసరి. మీరు హెల్మెట్ కొనుగోలు చేసినప్పుడు దానిపై ISI గుర్తును చెక్ చేయాలి. ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ మార్క్ ప్రకారం హెల్మెట్ నాణ్యత బాగుండాలి. దీంతోపాటు ఇతర విషయాలు కూడా గమనించాలి. భారతదేశం వంటి దేశంలో చాలా వేడి ఉంటుంది. దీని నుంచి రక్షించడానికి గాలి అవసరం. వెంటిలేషన్ దీనికి సాయపడుతుంది. కాబట్టి గాలి బాగా ఆడే విధంగా ఉండే హెల్మెట్ తీసుకోవాలి.

Tags:    

Similar News