UPI Transaction: పొరపాటున వేరొక నెంబర్‌కు డబ్బు బదిలీ అయిందా.. అప్పుడు ఈ విధంగా చేయండి..!
UPI Transaction: కొన్నిసార్లు యూపీఐ ట్రాన్జాక్షన్స్ చేసేటప్పుడు పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు సెండ్ అవుతాయి.
UPI Transaction: కొన్నిసార్లు యూపీఐ ట్రాన్జాక్షన్స్ చేసేటప్పుడు పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు సెండ్ అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా టెన్షన్ మొదలవుతుంది. ఆ డబ్బులు ఎవరికి సెండ్ అయ్యాయో తెలియదు. వాటిని తిరిగి ఎలా పొందాలో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు రిలాక్స్‌గా ఈ పద్దతిని పాటించి డబ్బులు తిరిగి పొందవచ్చు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ముందుగా గూగుల్‌లో NPCI అని సెర్చ్ చేయాలి. తర్వాత దాని లింక్‌పై క్లిక్ చేయాలి. NPCI అధికారిక సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎగువన ఎడమ వైపున ఉన్న మూడు చుక్కల మెనుపై క్లిక్ చేయాలి. ఇందులో చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మీరు దిగువన ఉన్న గెట్ ఇన్ టచ్ విభాగంలోకి వెళ్లాలి. ఇందులో UPI ఫిర్యాదు ఎంపికపై క్లిక్ చేయాలి.
తర్వాత లావాదేవీ ఆప్షన్‌కు వెళ్లాలి. ఇందులో మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతారు. స్క్రీన్‌పై అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలను నింపిన తర్వాత ఓకె చేయాలి. UPI ఫిర్యాదును ఫైల్ చేసిన తర్వాత మీ డబ్బు కొన్ని గంటల్లో మీకు తిరిగి వస్తుంది. ఈ విధంగా భారత ప్రభుత్వ ఈ అధికారిక సైట్ సాయంతో తప్పు ఖాతాకు బదిలీ అయిన డబ్బును తిరిగి పొందవచ్చు.