Google Pixel-8a: గూగుల్ పిక్సెల్ 8ఎ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ముందుగా బుక్ చేసుకున్నవారికి అవి ఫ్రీ..!
Google Pixel-8a: స్మార్ట్‌ఫోన్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 8 ఏ ను కంపెనీ అట్టహాసంగా విడుదల చేసింది.
Google Pixel-8a: స్మార్ట్‌ఫోన్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 8 ఏ ను కంపెనీ అట్టహాసంగా విడుదల చేసింది. మొదట మే 14 న రిలీజ్ చేస్తామని చెప్పిన గూగు ల్ 7వతేదీ సాయంత్రమే ఎలాంటి హడావిడి లేకుండా విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ బుకిం గ్స్, కొనుగోళ్లు మాత్రం మే 14 నుంచే జరుగుతాయి. కంపెనీ ముందుగా బుక్ చేసుకునేవారికి ఓ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. రూ.999కే పిక్సెల్ ఏ-సిరీస్ బడ్స్‌ను సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 8 ఏ ధర, ఫీచర్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఈ కొత్త ఫోన్ గూగుల్ సెన్సార్ జీ3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో తరహాలోనే జెమిని, బెస్ట్ టేక్, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి అత్యాధునిక ఫీచర్లు అందించారు. గూగుల్ పిక్సెల్ 8ఏ ఫ్లిప్‌కార్ట్‌లో ముందస్తుగా ఆర్డర్ చేయొచ్చు. 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 52,999. 256జీబీ ఫోన్ ధర రూ.59,999. లాంఛ్ ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై రూ.9,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు.
పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో తరహాలోనే చాలా ఏఐ ఫీచర్లను పిక్సెల్ 8ఏ లోనూ గూగుల్ కొనసాగించింది. వెనక 64MP ప్రధాన లెన్స్‌తో పాటు 13MP అల్ట్రావైడ్ లెన్స్‌తో కెమెరా ఇచ్చారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరాను పొందుపర్చారు. వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు అనవసర శబ్దాలను తొలగించేలా ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ఉంది. 120Hz రీఫ్రెష్ రేటు, 2,000nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.1 అంగుళాల స్క్రీన్ ను అందించారు. దీనిపై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణనిచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,404mAh బ్యాటరీని ఇచ్చారు. 8జీబీ ర్యామ్‌తో 128జీబీ/256జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.