Google Pay: గూగుల్‌పేలో బై నౌ పే లేటర్‌ ఆఫ్షన్.. ఇకపై మరింత సేఫ్‌గా కార్డ్ వివరాలు..!

Google Pay: గూగుల్‌ పేమెంట్‌ యాప్ గూగుల్‌పే (Google pay) ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం అంతా వాడుతుంటాం. చాలామంది ఫోన్లలో ఈ యాప్ ఉంటుంది.

Update: 2024-05-24 04:38 GMT

Google Pay: గూగుల్‌పేనూ బై నౌ పే లేటర్‌ ఆఫ్షన్.. ఇకపై మరింత సేఫ్‌గా కార్డ్ వివరాలు..!

Google Pay: గూగుల్‌ పేమెంట్‌ యాప్ గూగుల్‌పే (Google pay) ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం అంతా వాడుతుంటాం. చాలామంది ఫోన్లలో ఈ యాప్ ఉంటుంది. ప్రస్తుతం చాలామంది ఆన్ లైన్ పేమెంట్స్ కోసం ఎక్కువగా వాడుతున్న యాప్‌లలో గూగుల్ యాప్ కూడా చేరింది. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది.

ప్రస్తుతం డిజిటల్‌ పేమెంట్లు విపరీతంగా పెరిగాయి. ఇందుకోసం 3 ఫీచర్లను గూగుల్ తీసుకొచ్చింది. ఇక నుంచి పేమెంట్స్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్‌ ప్రయోజనాలు, బై నౌ పే లేటర్‌, కార్డ్‌ వివరాలకు సేఫ్టీ కల్పించడం వంటి సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందించింది.

క్రెడిట్ కార్డులతో పేమెంట్స్ చేసేప్పుడు ఎన్నో ఆఫర్లు లభిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ కార్డులు వారే చాలామంది ఉన్నారు. దీంతో అధిక ప్రయోజనాలు పొందాలని అంతా చూస్తుంటారు. ఈ క్రమంలో యూజర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు ఈ మూడు కొత్త ఫీచర్లు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ప్రతీ క్రెడిట్ కార్డ్‌కు కొన్ని ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. వీటిని గుర్తుంచకోవడం చాలా కష్టం. ఈ క్రమంలో గూగుల్ పేతో పేమెంట్స్ చేసే సమయంలో అందులో యాడ్ చేసిన కార్డులతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూపిస్తుంది.

అంటే, ఏ కార్డుతో పేమెంట్స్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో గూగుల్ పే చూపిస్తుంది.ఈ ఫీచర్‌తో అన్ని కార్డుల ప్రయోజనాలును ఒకే సారి చెక్ చేసుకోవచ్చన్నమాట. మ్యానువల్‌గా చెక్ చేసుకునే అవసరం ఉండదన్నమాట. అయితే, డెస్క్‌టాప్‌లో గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో షాపింగ్ చేస్తూ.. గూగుల్‌ పేతో పేమెంట్స్ చేసే సందర్భంలో ఈ ఆప్షన్స్‌ కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది.

బై నౌ పే లేటర్‌..

ఈ మధ్య చాలామందికి ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కొనడం, తర్వాత పేమెంట్ చేయండి. చాలా యాప్స్ ఇలాంటి ఫీచర్‌ను అందిస్తున్నాయి. గూపుల్ పే‌తో పేమెంట్స్ చేసే సమయంలోనూ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది.

క్రెడిట్న, డెబిట్ కార్డ్ వివరాలు సేఫ్..

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేప్పుడు ప్రతిసారీ క్రెడిట్ కార్డ్ డిటేల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. చాలామంది కార్డ్ విరాలను సేవ్ చేసేందుకు ఇష్టపడరు. అయితే, గూగుల్ పేలో ఇకపై కార్డ్ వివరాలను నమోదు చేయడంతోపాటు నమోదు చేసిన వివరాలు సేఫ్‌గా ఉంచేందుకు అధికా ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా ఆల్ ఫిల్‌తో కార్డ్ వివరాలను ప్రతీసారి ఎంటర్ చేయకుండా చూడొచ్చు.

ఆన్‌లైన్‌ షాపింగ్ చెక్‌అవుట్‌ టైంలో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. గూగుల్‌పే ద్వారా ఈ ఆటోఫిల్ ఫీచర్ ఎంతో పేఫ్టీగా ఉంటుంది. క్రోమ్‌ లేదా ఆండ్రాయిడ్‌లో గూగుల్‌పేని ఉపయోగించే సందర్భంలో ఈ ఆటో ఫిల్ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ఫింగర్‌ ప్రిట్‌, ఫేస్‌ స్కాన్‌, లాక్‌ పిన్‌‌తోనేనే ఈఫీచర్‌ను ఉపయోగించడం సాధ్యమవుతుంది. దీంతో కార్డ్ వివరాలతో పాటు భద్రత కూడా చాలా సేఫ్‌గా ఉంటాయన్నమాట.

Tags:    

Similar News