Google Map Business: గూగుల్ మ్యాప్‌తో సంపాదించండి.. ఈ ఒక్క పనిచేస్తే చాలు..!

Google Map Business: మనకి తెలియని ప్రదేశాలకి దారి చూపించే గూగుల్‌ మ్యాప్‌ ద్వారా లాభాలని ఆర్జించవచ్చు.

Update: 2023-07-11 13:32 GMT

Google Map Business: గూగుల్ మ్యాప్‌తో సంపాదించండి.. ఈ ఒక్క పనిచేస్తే చాలు..!

Google Map Business: మనకి తెలియని ప్రదేశాలకి దారి చూపించే గూగుల్‌ మ్యాప్‌ ద్వారా లాభాలని ఆర్జించవచ్చు. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ఇందుకోసం బాగా కష్టపడాల్సిన అవసరం లేదు కొంచెం సమాచారాన్ని అందించి సులువగా సంపాదించవచ్చు. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ గూగుల్‌ మ్యాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది మనల్ని సరైన గమ్యస్థానానికి తీసుకెళుతుంది. లొకేషన్ లేదా ప్లేస్ పేరు ఎంటర్ చేసిన వెంటనే మార్గాన్ని చూపుతుంది. ఇది కాకుండా సమీపంలోని హోటల్, రెస్టారెంట్, పెట్రోల్ పంప్ వంటి అన్ని ప్రదేశాలను చూపుతుంది.

ఇప్పటివరకు చాలా మంది గూగుల్ మ్యాప్‌లో లొకేషన్‌ను మాత్రమే చూసారు కానీ ఇక నుంచి డబ్బు సంపాదించే మార్గాన్ని తెలుసుకోండి. గూగుల్‌ మ్యాప్‌ అనేది గూగుల్‌ కంపెనీ వెబ్ ఆధారిత సేవ. ఇందులో మొత్తం ప్రపంచంలోని భౌగోళిక ప్రాంతాల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా రవాణా, సరైన ప్రదేశం, చిరునామా, కొత్త ప్రదేశాలని వెతకడం చేయవచ్చు. అయితే గూగుల్‌ మ్యాప్స్‌లో కంటెంట్‌ను అందించి పాయింట్‌లను సంపాదించవచ్చు. గూగుల్‌ మ్యాప్స్‌లో స్థానిక గైడ్‌గా మారవచ్చు. దీని ద్వారా సంపాదించవచ్చు.

గూగుల్‌ మ్యాప్‌లో ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయవచ్చు. మీరు ఉండే ప్రదేశం గురించి సమాచారం అందించవచ్చు. అంతేకాదు మారిన అడ్రస్‌లని అప్‌డేట్‌ చేయవచ్చు. తప్పిపోయిన ప్రదేశాలని యాడ్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఉండే ప్రదేశాల సమాచారాన్ని అప్‌డేట్‌ చేయవచ్చు. ఈ పనులన్నీ చేసినందుకు గూగుల్‌ మీకు పాయింట్లు కేటాయిస్తుంది. ప్రతి రివ్యూకి గూగుల్‌ 10 పాయింట్‌లను ఇస్తుంది. ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తే 5 నుంచి 7 పాయింట్లను పొందుతారు.

గూగుల్‌ మ్యాప్‌లో స్థానిక గైడ్‌గా మారడానికి ఈ విధంగా చేయండి..

1. ఇందుకోసం గూగుల్‌ మ్యాప్‌లో మీ జీ మెయిల్‌ ఐడీతో లాగిన్ అవ్వండి.

2. మీ ప్రొఫైల్ ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత ఫొటోపై క్లిక్ చేయాలి.

3. మీకు జాయిన్ లోకల్ గైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి జాయిన్ నౌపై క్లిక్ చేయాలి.

4. ఇక్కడ నగరాన్ని ఎంచుకొని నిబంధనలు, షరతులను ఆమోదించి స్టార్ట్‌ ఎంపికపై క్లిక్ చేయాలి.

గూగుల్‌ యాడ్‌నెస్‌ ప్రోగ్రామ్

మీరు గూగుల్‌ మ్యాప్స్‌ని ఉపయోగించి డబ్బు సంపాదించడానికి గూగుల్‌యాడ్‌ నెస్‌ని ఉపయోగించవచ్చు. ఇది ఒక ప్రోగ్రామ్. ఇది వెబ్‌సైట్ లేదా బ్లాగ్‌లో ప్రకటనలను ఉంచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ పరిస్థితిలో ఎవరైనా ఆ ప్రకటనలపై క్లిక్ చేసినప్పుడు దాని నుంచి డబ్బు సంపాదిస్తారు. స్థానిక వ్యాపారానికి సంబంధించిన ప్రకటనలను చేయడానికి వెబ్‌సైట్ లేదా బ్లాగ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ని ఉపయోగించవచ్చు. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా వచ్చిన పాయింట్లని మీకు కావలసినప్పుడు రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News