Smartphones: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. ఓ లుక్కేయండి..!

smartphones under Rs 15000: భారతదేశంలో రూ. 15,000 కంటే తక్కువ ధరకు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం 5G ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఈ బడ్జెట్‌లో దొరకడం కొంచెం కష్టం. ఏ ఫీచర్ విషయంలోనూ రాజీ పడకుండా రూ.15,000 కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.

Update: 2023-05-07 15:30 GMT

Smartphones: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. ఓ లుక్కేయండి..

Smartphones Under Rs 15000: భారతదేశంలో రూ. 15,000 కంటే తక్కువ ధరకు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం 5G ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఈ బడ్జెట్‌లో దొరకడం కొంచెం కష్టం. ఏ ఫీచర్ విషయంలోనూ రాజీ పడకుండా రూ.15,000 కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. మెరుగైన స్పెసిఫికేషన్‌లతో కూడిన 4G ఫోన్ లేదా 5G సపోర్ట్ ఉన్న సాధారణ ఫోన్‌లతోపాటు 2023 సంవత్సరంలో 15 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Realme 10 4G..

Realme 10 4G 6.4-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంది. ఫోన్‌లో Mediatek MT8781 Helio G99 (6nm) ఆక్టా కోర్ ప్రాసెసర్, 4GB RAM, 64GB స్టోరేజ్ అందించారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం, ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999లుగా ఉంది.

Samsung Galaxy F14 5G..

Samsung Galaxy F14 5G 1080 x 2408 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా కోర్ Exynos 1330 (5nm) ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 6GB RAM, 128GB నిల్వను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో మొదటి కెమెరా 50 మెగాపిక్సెల్‌లు, రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్‌లు అందించారు. ఇందులో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,990 ధరకు అందుబాటులో ఉంది.

Realme C55..

Realme C55 అనేది Mediatek Helio G88 ప్రాసెసర్‌తో పనిచేసే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. ఇది 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. Realme C55 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999లుగా ఉంది.

Tags:    

Similar News