Flipkart Electronics Sale 2023: ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్.. స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్లు..!
Flipkart Electronics Sale 2023: ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 24 ఫిబ్రవరి 2023 నుంచి ప్రారంభమైంది.
Flipkart Electronics Sale 2023: ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ 24 ఫిబ్రవరి 2023 నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ వినియోగదారుల కోసం ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. 28 ఫిబ్రవరి 2023 వరకు లైవ్ ఉంటుంది. మీరు చాలా కాలంగా కొత్త టీవిని కొనాలనుకుంటే ఇది సువర్ణవకాశమని చెప్పవచ్చు. రూ.6,799తో ఎల్‌ఈడీ టీవీని ఇంటికి తీసుకురావచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ 2023లో అదనపు డబ్బును ఆదా చేయాలనుకుంటే ICICI, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్డుని ఉపయోగించాలి. 10 శాతం తక్షణ తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతారు.
Blaupunkt 24 అంగుళాల స్మార్ట్ టీవీ
24 అంగుళాల విభాగంలో స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన ఏకైక కంపెనీ Blaupunkt. ఫ్లిప్‌కార్ట్ సేల్ సందర్భంగా మీరు ఈ సరికొత్త 24 అంగుళాల టీవీని రూ.6 వేల 799కి కొనుగోలు చేయగలరు. ఇందులో సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో రెండు స్పీకర్లు, HD రెడీ డిస్‌ప్లేను అందించింది. అలాగే ఈ టీవీ స్క్రీన్ 300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
TCL 32 అంగుళాల LED TV
మీరు 32 అంగుళాల స్మార్ట్ టీవీని 10 వేల రూపాయలలోపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో 66 శాతం తగ్గింపు తర్వాత ఈ టీవీ మోడల్ రూ.8,999కి విక్రయిస్తున్నారు. ఫీచర్ల గురించి మాట్లాడుతూ ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా ఈ టీవీలో 16 W సౌండ్ అవుట్‌పుట్, 60 Hz రిఫ్రెష్ రేట్‌ను పొందుతారు.
OnePlus Y1 40 అంగుళాల Android TV
ఈ టీవీలో 20-వాట్ స్పీకర్లు, 64-బిట్ శక్తివంతమైన ప్రాసెసర్, Google అసిస్టెంట్, అంతర్నిర్మిత Chromecast, 60 Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ ఆడియోతో 1920 x 1080 పిక్సెల్‌ల పూర్తి HD రిజల్యూషన్ ఉన్నాయి. టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ వంటి యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. సేల్‌లో 32 శాతం తగ్గింపు తర్వాత ఈ టీవీని రూ.18,999కి విక్రయిస్తున్నారు. అయితే రూ.1500 బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ తర్వాత మీరు దీన్ని రూ.17,499కి కొనుగోలు చేయవచ్చు.