Budget Rakhi Gifts: రక్షా బంధన్.. బెస్ట్ బడ్జెట్ గిఫ్ట్స్.. మీ సోదరికి తోడుగా నిలవండి..!

Budget Rakhi Gifts: రక్షాబంధన్‌కి మీ సోదరకి గిఫ్ట్‌గా 2000 రూపాయల కంటే తక్కువ ధరకే లభించే గ్యాడ్జెట్లను అందించండి.

Update: 2024-08-14 12:55 GMT

Budget Rakhi Gifts

Budget Rakhi Gifts: అన్నదమ్ముల ప్రేమకు అతి పెద్ద పండుగ రక్షా బంధన్. ఈ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19వ తేదీ సోమవారం నిర్వహిస్తారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడిని రక్షించడానికి రక్షా సూత్రాన్ని అతని మణికట్టుపై కడతారు. సోదరుడు తన సోదరిని జీవితాంతం కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. సోదరుడికి రాఖీ కట్టే ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే ఈ పండుగకు మరికొన్ని రోజులే మిగిలి ఉంది. ఇప్పటికే అక్కచెల్లెమ్మలకు బహుమతులు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మీరు మీ సోదరి హృదయాన్ని గెలుచుకోనే 2000 రూపాయల కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయగల గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

Smartwatch
ఈ రాఖీ డేకి స్మార్ట్‌వాచ్‌ను గిఫ్ట్‌గా అందించడండి. దీనిలో టైమ్ చూడటమే కాకుండా ఇది మీ స్టైల్‌ని బెటర్‌గా చేస్తుంది. ఫిట్‌నెస్‌పై నిఘా ఉంచుతుంది. అనేక బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లు రూ.2,000 కంటే తక్కువ ధరకే మార్కెట్‌లో లభిస్తున్నాయి. స్మార్ట్‌వాచ్‌లో అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. దీనితో పాటు డిఫరెంట్ వాచ్‌ఫేస్‌లు కూడా ఉంటాయి. వీటిని మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. మీరు Vingajoy W-300 Humsafar స్మార్ట్‌వాచ్‌ కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 1799. ఇది కాకుండా రూ. 1399 విలువైన నాయిస్ ట్విస్ట్ గో రౌండ్ డయల్ వాచ్, రూ. 1699 విలువైన ఫైర్-బోల్ట్ ఆర్క్ కూడా మంచి ఎంపిక.

Bluetooth Speaker
తీరిక సమయాల్లో లేదా రోజువారీ పనులు చేసుకుంటూ పాటలు వినడంలో ఉండే సరదా ఉంటుంది. మీ సోదరి కూడా తన తీరిక సమయంలో లేదా రోజువారీ పని చేస్తున్నప్పుడు స్పీకర్‌లో పాటలు వినడానికి ఇష్టపడితే, మీరు ఆమెకు బ్లూటూత్ పాకెట్ స్పీకర్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. రూ. 2000 కంటే తక్కువ ధరతో అనేక బ్రాండెడ్ స్పీకర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వింగాజోయ్ మినీ డైనమైట్ SP-150 ధర రూ. 1699. బోట్ స్టోన్ 180 ధర రూ. 979. రూ. 1198 ధర కలిగిన మివీ రోమ్ 2 కూడా కొనుగోలు చేయవచ్చు.

Power Bank
మీరు ఆఫీసులో పని చేస్తున్నా లేదా ప్రయాణంలో ఉన్నా, మీ ఫోన్, ఇతర గాడ్జెట్‌లు అన్ని సమయాలలో కనెక్ట్ అయి ఉండటానికి ఫుల్ ఛార్జ్ చేయబడటం చాలా ముఖ్యం. మీరు మీ సోదరికి పవర్ బ్యాంక్‌ను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. 2000 రూపాయల కంటే తక్కువ ధరకు మార్కెట్లో అనేక పవర్ బ్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆంబ్రేన్ 20000mAh పవర్‌బ్యాంక్‌ను రూ. 1499కి కొనుగోలు చేయవచ్చు. రూ. 1499కి Mi 10000mAh పాకెట్ ప్రో పవర్‌బ్యాంక్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు.

Earbuds
మీ సోదరి పాటలు వినడానికి ఇష్టపడితే లేదా ఆన్‌లైన్ క్లాస్‌లు హాజరవుతున్నట్లయితే, మీరు ఇయర్‌బడ్‌లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. Ubon Alien Series BT-75 ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన డిజైన్‌తో బహుమతిగా ఇవ్వవచ్చు. దీని ధర రూ. 1199. మీరు ఇటీవల ప్రారంభించిన ట్రూక్ BTG ఫ్లెక్స్ కోసం కూడా ట్రై చేయవచ్చు. దీని ధర రూ.999. ఇది కాకుండా రూ. 1998 విలువైన OnePlus Nord Buds 2R, రూ. 1499 విలువైన Soundcore Anker P25i. రూ. 1,999 విలువైన Mivi SuperPods బహుమతులుగా అందిచవచ్చు.

Tags:    

Similar News