WiFi Safety Tips: వైఫైకి సంబంధించి ఈ పొరపాట్లు చేయవద్దు.. కుటుంబ భద్రతకు ప్రమాదం..!
WiFi Safety Tips: ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుంటే ఏ పని జరగడం లేదు. ఆఫీసు పని నుంచి మనీ ట్రాన్జాక్షన్ వరకు అన్ని ఇంటర్నెట్‌తోనే ముడిపడి ఉన్నాయి.
WiFi Safety Tips: ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుంటే ఏ పని జరగడం లేదు. ఆఫీసు పని నుంచి మనీ ట్రాన్జాక్షన్ వరకు అన్ని ఇంటర్నెట్‌తోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఇంట్లో వై ఫై వాడుతున్నారు. దీనివల్ల అన్ని పనులు ఇంట్లో నుంచే సులభంగా చేయవచ్చు. కరోనా వల్ల ఈ ట్రెండ్ మరింత పెరిగిపోయింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వైఫై వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు కొన్నిప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే వై ఫై వాడేటప్పుడు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. వాటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. వైఫై నెట్‌వర్క్‌లో ఏదైనా ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగించకపోతే సైబర్ నేరగాళ్లు దీనిని హ్యాక్ చేయడం సులభం అవుతుంది. కనీసం WPA లేదా WPA2 పర్సనల్ (PSK) భద్రతా మోడ్‌ని ఉపయోగించాలి. దీనివల్ల బయటి వ్యక్తి మీ వైఫైని తప్పుగా ఉపయోగించలేరు.
2. చాలా మంది హోమ్ రూటర్‌లో ఎలాంటి పాస్‌వర్డ్‌ను పెట్టుకోరు. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. మీ వైఫై నెట్‌వర్క్ పొరుగువారు లేదా బాటసారులు ఉపయోగించే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల మీ వైఫై వేగం తగ్గుతుంది. దీంతోపాటు సైబర్ నేరగాళ్లు పాస్‌వర్డ్ లేని రూటర్‌పై సులభంగా దాడి చేసి మీ వ్యక్తిగత విషయాలని దొంగిలిస్తారు. దీన్ని నివారించాలంటే Wi-Fi పాస్‌వర్డ్‌ను ఎంచుకుని దాన్ని తరచుగా మారుస్తు ఉండాలి.
3. అలాగే రూటర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం అవసరం. దీనివల్ల అది ఎటువంటి ఇబ్బది లేకుండా నడుస్తుంది. వేగం పెరుగుతుంది. హ్యాకర్ల బారినపడుకుండా ఉంటుంది.
4. అలాగే వైఫై నెట్‌వర్క్‌ను అనధికారిక యాక్సెస్ నుంచి రక్షించడంలో ఫైర్‌వాల్ సహాయపడుతుంది. సాధారణంగా అన్ని WiFi పరికరాలు డిఫాల్ట్ ఫైర్‌వాల్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి. అయితే ఇది ఇన్‌స్టాల్ చేయబడిందా లేదా అని గమనించుకోవడం అవసరం.
5. మీ వైఫై ద్వారా ఎన్ని గాడ్జెట్లు నడుస్తున్నాయో అప్పుడప్పుడు చెక్ చేయాలి. ఒక్కోసారి అపరిచితులు ఉపయోగించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు. అలాగే ఎక్కువ గాడ్జెట్లు వైఫైకి కనెక్ట్ చేస్తే దాని వేగం తగ్గుతుంది. కాబట్టి పరిమిత పరికరాలను మాత్రమే ఉపయోగించాలి.