Laptop Battery Damaged: ల్యాప్‌టాప్‌ బ్యాటరీ త్వరగా పాడైపోతుందా.. ఈ 4 తప్పులను నివారించండి..!

Laptop Battery Damaged: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ల్యాప్‌టాప్‌ తప్పనిసరిగా మారింది.

Update: 2024-02-20 15:00 GMT

Laptop Battery Damaged: ల్యాప్‌టాప్‌ బ్యాటరీ త్వరగా పాడైపోతుందా.. ఈ 4 తప్పులను నివారించండి..!

Laptop Battery Damaged: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ల్యాప్‌టాప్‌ తప్పనిసరిగా మారింది. స్కూల్‌ స్టూడెంట్లు హోం వర్క్‌ చేసుకునే దగ్గరి నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తుల వరకు ప్రతి ఒక్కరికి ల్యాప్‌టాప్‌ అవసరమవుతుంది. ముఖ్యంగా కరోనా సమయంలో చాలామంది వర్క్‌ ఫ్రం హోం చేశారు. దీనివల్ల ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ పెరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ల్యాప్‌టాప్‌ బ్యాటరీ తరచూ పాడవుతుంటుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అయతే బ్యాటరీ దెబ్బతినకుండా ల్యాప్‌టాప్ చాలా రోజుల వరకు రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఉష్ణోగ్రత

ల్యాప్‌టాప్ వేడెక్కడం మొదలైతే బ్యాటరీపై ప్రభావం పడుతుంది. మీరు ఎండలో కూర్చొని పని చేస్తే లేదా ల్యాప్‌టాప్‌లో సిస్టమ్ పనితీరును ప్రభావితం చేసే ఏదైనా పని చేస్తుంటే ల్యాప్‌టాప్ వేడిగా మారుతుంది.

తరచు ఛార్జింగ్

కొంతమందికి ల్యాప్‌టాప్‌లో బ్యాటరీ తగ్గిన వెంటనే మళ్లీ మళ్లీ ఛార్జింగ్ చేసే అలవాటు ఉంటుంది. బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జింగ్ చేసి ఎక్కువసేపు ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ జీవితకాలం తగ్గుతుంది. అందువల్ల ల్యాప్‌టాప్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి బదులుగా 80 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయడం మంచిది. ఇది కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే ల్యాప్‌టాప్‌ను ఛార్జ్‌ చేయడం ఉత్తమం.

డిశ్చార్జ్ చేయడానికి

ల్యాప్‌టాప్‌లోని బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయినప్పుడే ఛార్జ్‌ చేస్తామని కొందరు అనుకుంటారు. కానీ అలా చేయడం సరికాదు. ల్యాప్‌టాప్ బ్యాటరీ 20 శాతానికి తగ్గితే ల్యాప్‌టాప్‌ను ఛార్జ్‌ చేయాలి. బ్యాటరీ పూర్తిగా డ్రెయిన్ అయ్యే వరకు వేచి ఉండడం మంచిదికాదు.

తప్పు ఛార్జర్

ల్యాప్‌టాప్‌తో వచ్చిన ఛార్జర్ పాడైపోయిన తర్వాత డబ్బు ఆదా చేయడానికి ప్రజలు లోకల్‌ ఛార్జర్‌ను కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది అయితే లోకల్ ఛార్జర్‌ని ఉపయోగించడం వల్ల ల్యాప్‌టాప్ బ్యాటరీకి హాని జరుగుతుంది.

Tags:    

Similar News