Washing Machine: వాషింగ్ మెషీన్ల కెపాసిటీని కిలోల్లోనే ఎందుకు చెబుతారో తెలుసా? ఇలా చేస్తే బట్టలు త్వరగా పాడైపోతాయి? ఆసక్తికర విషయాలు మీకోసం..!

మనం బట్టలు ఉతికి, వాషింగ్ మెషీన్ను పూర్తిగా ప్యాక్ చేస్తాము, తేమ కారణంగా వాసన రావడం మరియు అది బయటకు రాలేకపోవడం చాలా సార్లు జరుగుతుంది. కాబట్టి మీరు బట్టలు ఉతికిన తర్వాత 40-45 నిమిషాలు తెరిచి ఉంచినట్లయితే, మీరు తదుపరిసారి ఉతకడానికి దానిలో బట్టలు వేస్తే, ఆ బట్టలు వాసన పడవు.

Update: 2023-08-08 15:30 GMT

Washing Machine: వాషింగ్ మెషీన్ల కెపాసిటీని కిలోల్లోనే ఎందుకు చెబుతారో తెలుసా? ఇలా చేస్తే బట్టలు త్వరగా పాడైపోతాయి? ఆసక్తికర విషయాలు మీకోసం..!

Washing Machine: వాషింగ్ మెషీన్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే, మరో విషయం గమనించారా. వాషింగ్ మెషీన్‌‌ను కేజీలలో ఎందుకు చెబుతుంటారు. ఇలా ఎందుకు పిలుస్తారో దాదాపు 90% మందికి ఖచ్చితంగా తెలియదు. కాగా, వాషింగ్ మెషీన్‌లో సెమీ, ఫుల్ ఆటోమేటిక్‌లు కూడా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇందులో 6kg, 6.5kg, 7kg, 8kg వంటి కెపాసిటీలతో వాషింగ్ మెషీన్లు మార్కెట్‌లోకి వస్తుంటాయి.

ఈ బరువు మొత్తం వాషింగ్ మెషీన్‌దేనని చాలా మంది అనుకుంటారు. చాలా మంది వాషింగ్‌ మెషీన్‌‌లో వేసే బట్టలతో పోల్చుతుంటారు. అయితే కిలోల లెక్కన అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..?

'వాషింగ్ మెషీన్ కెపాసిటీ 6కిలోలు' అని ఉంటే.. దాని సామర్థ్యం 6 కిలోలుగా గుర్తించాలి. అంటే వాషింగ్ మెషీన్ ఒకేసారి ఎన్ని బట్టలు ఉతకగలదనే విషయ తెలుస్తుంది.

ప్రతి వాషింగ్ మెషీన్ అది నిర్ణయించిన కిలోగ్రాముల కెపాసిటీ వరకే లోడ్ వేయాలి. అంటే అందులో ఉతకగలిగే పొడి బట్టల లోడ్ 6 కిలోలు అని గుర్తించాలి.

అలాగే, ఒకసారి వేసే దుస్తులు వాషింగ్ మెషీన్‌లో 70-80% వరకు మాత్రమే నింపాలి. తద్వారా డ్రమ్ దాని పనిని సులభంగా చేయగలదని గుర్తుంచుకోవాలి.

అంతకు మించి దుస్తులు వేయడం వల్ల ఓవర్‌లోడింగ్ అంటారు. మీరు అవసరమైన దానికంటే ఎక్కువ లాండ్రీని ఉంచినట్లయితే, మూత సరిగ్గా పట్టదు. అలాగే ఉతికే సమయంలో మెషీన్‌పై లోడ్ అధికంగా పడి సరిగ్గా పనిచేయదు.

ఓవర్ లోడింగ్ వల్ల డ్రమ్ బ్యాలెన్స్ సరిగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత డిటర్జెంట్ పౌడర్ వేసినా బట్టలు శుభ్రంగా ఉండవు. అలాగే మనం బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మెషీన్‌ డోర్‌ను క్లోజ్ చేయకూడదు. తేమ కారణంగా వాసన రావడం జరుగుతుంది. కాబట్టి, మీరు బట్టలు ఉతికిన తర్వాత 40-45 నిమిషాలు తెరిచి ఉంచితే, మీరు తదుపరిసారి ఉతకడానికి దానిలో బట్టలు వేస్తే, ఆ బట్టలు వాసన రాకుండా ఉంటాయి.

Tags:    

Similar News