Power Bill: రూ. 245 ఖర్చు చేస్తే చాలు.. జీవితాంతం కరెంట్ బిల్లుతో నో టెన్షన్.. ఎలాగో తెలుసా?

Electric Bill: కరెంటు బిల్లు ఆదా చేసుకునేందుకు మార్కెట్‌లో ఎన్నో రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిలో దేనినైనా వినియోగిస్తే.. కరెంటు బిల్లు ఆదా అవుతుందా లేదా అనే సందేహం ప్రజల్లో నెలకొంది.

Update: 2023-05-07 06:48 GMT

Power Bill: రూ. 245ల ఖర్చు చేస్తే చాలు.. జీవితాంతం కరెంట్ బిల్లుతో నో టెన్షన్.. ఎలాగో తెలుసా?

Power Bill: కరెంటు బిల్లు ఆదా చేసుకునేందుకు మార్కెట్‌లో ఎన్నో రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిలో దేనినైనా వినియోగిస్తే.. కరెంటు బిల్లు ఆదా అవుతుందా లేదా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. యూనిట్ల ఖరీదు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కరెంటు బిల్లు పెద్ద సమస్యగా మారనుంది. ఇటువంటి పరిస్థితిలో, ఒక నెలలో కొంచెం ఎక్కువ విద్యుత్తును ఉపయోగిస్తే.. ఆ నెలలో మీ బడ్జెట్‌లో భారీగా కోత పడనుంది. ఇలా జరగకూడదంటే.. ఈ రోజు విద్యుత్ బిల్లును సున్నాకి తగ్గించడంలో గొప్పగా ఉపయోగపడే పరికరం గురించి చెప్పబోతున్నాం.

ఈ పరికరం నిజానికి సౌరశక్తితో నడిచే LED లైట్. విద్యుత్తు అంతరాయం సమస్య లేదా విద్యుత్ బిల్లు అవసరానికి మించి ఉన్న ప్రదేశాలలో దీన్ని ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఈ LED లైట్ గొప్ప లక్షణం ఏమిటంటే, దానిని వెలిగించడానికి మీరు దానిని ఆన్ చేయవలసిన అవసరం లేదు లేదా దానికి మీరు ఎలాంటి శక్తిని అందించాల్సిన అవసరం లేదు. సూర్యరశ్మి వచ్చే చోట మీరు సౌరశక్తితో పనిచేసే లైట్‌ను అమర్చాల్సి ఉంటుంది. ఇది సోలార్ ప్యానెల్స్, దానితో జతచేసిన బ్యాటరీల నుంచి శక్తిని ఉత్పత్తి చేస్తుంది, అలాగే దానిని నిల్వ చేస్తుంది.

ధర ఎంత, ప్రత్యేకత ఏమిటి..

ధర గురించి చెప్పాలంటే అమెజాన్ నుంచి కేవలం రూ.245తో ఈ పరికరాన్ని కొనుగోలు చేయవచ్చు. వివిధ వెబ్‌సైట్లలో దీని ధర కూడా మారుతూ ఉంటుంది. దీని డిజైన్ చాలా ఆకట్టుకుంటుంది. ఈ LED లైట్ పోర్టబుల్‌గా ఉంటుంది. దీని కారణంగా మీరు దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మీరు దీన్ని నేరుగా సూర్యకాంతి పడేచోట మీ ఇంటి తోట, టెర్రస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో ఇన్‌స్టాల్ చేసిన మోషన్ సెన్సార్ కారణంగా వెంటనే ఆన్ అవుతుంది. 

Tags:    

Similar News