Airtel: రూ.9కే 10జీబీ డేటా.. ఎయిర్‌టెల్ నుంచి కొత్త ప్లాన్.. కానీ, ఓ కండీషన్..!
అయితే, ఈ ప్లాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు, లేదా సినిమా లవర్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. తక్కువ కాలానికి ఎక్కువ డేటాను ఉపయోగించుకోవాలనే వారికి ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది
Bharti Airtel: ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగదారులకు తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.10ల కంటే తక్కువే. అంతే, దీని అసలు ధర రూ.9లు మాత్రమే. అంటే, ఈ ప్లాన్ ఓ డేటా వోచర్ అన్నమాట. ఈ ప్లాన్‌కు ఎలాంటి వ్యాలిడిటీ ఉండదు. ఈ ప్లాన్‌తో 10 జీబీ డేటా వినియోగదారులకు అందిస్తుంది. అంతా బాగుందని గబగబా రీఛార్జ్ చేసుకునేరు.. ఇక్కడే ఓ ఝలుక్ ఇచ్చింది ఎయిర్ టెల్ కంపెనీ. అదేంటంటే దీన్ని కేవలం రీఛార్జ్ చేసుకున్న గంటలోపే వాడుకోవాలి.
అయితే, ఈ ప్లాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు, లేదా సినిమా లవర్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. తక్కువ కాలానికి ఎక్కువ డేటాను ఉపయోగించుకోవాలనే వారికి ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. మిగతా కంపెనీల్లో 10జీబీ డేటా కోసం రూ.100లకు పైనే రీ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కోసం మొబైల్ యాప్ లేదా ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు.