Flipkart: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బంపరాఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు..!

Flipkart: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లు అందిస్తోంది. మెగా జూన్‌ బొనాంజా సేల్ పేరుతో ఈ సేల్‌ను అందిస్తున్నారు.

Update: 2024-06-14 12:30 GMT

Flipkart: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బంపరాఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు..!

Flipkart: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లు అందిస్తోంది. మెగా జూన్‌ బొనాంజా సేల్ పేరుతో ఈ సేల్‌ను అందిస్తున్నారు. జూన్‌ 13వ తేదీన మొదలైన సేల్‌ జూన్‌ 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో ఏయే ఫోన్స్‌పై ఎంత డిస్కౌంట్‌ అందిస్తున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్‌ 15..

ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 15పై 19 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 79,900కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ. 63,999కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను అందించారు. ఏ16 బయోనిక్‌ చిప్‌సెట్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో.. 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

రియల్‌ మీ పీ1 5జీ..

జూన్‌ బొనాంజా సేల్‌లో భాగంగా రియల్‌మీ పీ1 ఫోన్‌పై కూడా డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 20,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 15,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 16 ఎంపీతో కూడిన సెల్ఫీ కెమెరాను అందించారు. ఎంపిక చేసిన క్రెడిట్‌, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు.

మోటోరోలా ఎడ్జ్‌ 50ప్రో..

ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 36,999కాగా సేల్‌లో భాగంగా రూ. 29,999కి సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. అలాగే 4,500 mAh బ్యాటరీని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాతోపాటు, సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం 50 ఎంపీ కెమెరాను అందించారు.

వివో టీ3ఎక్స్‌..

వివో టీ3 ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌పై సేల్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.72 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్సమేము కెమెరా గురించి మాట్లాడినట్లయితే, ఇది 50 MP + 2 MP వెనుక కెమెరా మరియు 8 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Tags:    

Similar News