GOAT Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌.. వీటిపై ఊహకందని ఆఫర్స్..

GOAT Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌.. వీటిపై ఊహకందని ఆఫర్స్..

Update: 2024-07-19 14:45 GMT

GOAT Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌.. వీటిపై ఊహకందని ఆఫర్స్.. 

GOAT Sale: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్ పేరుతో సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈనెల 20,21 తేదీల్లో ఈ సేల్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా భారీ ఆఫర్లను ప్రకటించాయి. అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తో పాటు, గృహోపకరణాలపై కూడా భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. ఇదిలా ఉంటే అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ సైతం సేల్‌ను నిర్వహిస్తోంది. గోట్‌ పేరుతో జూలై 19 నుంచి 23 వరకూ ఐదురోజులపాటు సేల్ ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్ సైతం భారీ ఆఫర్లను అందిస్తోంది. అన్ని రకాల వస్తువుల కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్ డిఎఫ్ సి బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ అందిస్తున్నారు. ఇక వీటితో పాటు కొన్ని రకాల స్మార్ట్‌ ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై లభిస్తోన్న కొన్ని బెస్ట్‌ డీల్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఈ సేల్‌లో భాగంగా లండనకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నథింగ్ ఫోన్‌2పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 33,999 కాగా, సేల్ భాగంగా రూ.28,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3 వేల డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు.

* ఐఫోన్‌ 14 ప్లస్‌పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ.55,999కాగా బ్యాంకు ఆఫర్లతో పాటు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి ఈ సేల్‌లో భాగంగా రూ. 53,999కి సొంతం చేసుకోవచ్చు.

* గూగుల్ పిక్సెల్‌ 8పై కూడా డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 61,999 రూపాయలు కాగా ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ లో కేవలం రూ. 47,999కే లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 డిస్కౌంట్ పొదొచ్చు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో మోడల్ పై కూడా తగ్గింపు ధర అందుబాటులో ఉంది. మార్కెట్ ధర 55,999 రూపాయలు కాగా 50,999 రూపాయలకు లభించనుంది.

* ఇక మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్‌పై కూడా డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 29,999 కాగా, సేల్‌లో భాగంగా రూ. 28000కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్‌ ఆర్లలో భాగంగా రూ 2 వేల డిస్కౌంట్‌ లభిస్తోంది.

Tags:    

Similar News