Apple WWDC 2021: జూన్ 7న ఆపిల్ ఈవెంట్: iOS 15 ప్రకటించే అవకాశం
Apple WWDC 2021: ఎట్టకేలకు ఆపిల్ తన తదుపరి WWDC (వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్) తేదీలను ప్రకటించింది.
Apple WWDC 2021: ఎట్టకేలకు ఆపిల్ తన తదుపరి WWDC (వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్) తేదీలను ప్రకటించింది. గత సంవత్సరం మాదిరిగానే, కంపెనీ ఆన్‌లైన్ లోనే ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేస్తుంది. జూన్ 7 నుంచి జూన్ 11 వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది.
ప్రతీ సంవత్సరం ఆపిల్ తన నూతన సాఫ్ట్‌వేర్ ను అందించే క్రమంలో ఈ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తుంది. iOS, iPadOS, watchOS, macOSలతోపాటు tvOS లను విడుదల చేస్తుంది. ఇప్పటికే ఉన్న ఆపిల్ డివైజ్ లకు కొత్త ఫీచర్లను సంస్థ అందిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం చివరలో విడుదల చేసే కొత్త ఓస్ లకు తుది మెరుగులు దిద్దేందుకు బీటా వర్షన్ ను విడుదలచేస్తుంది.
ఐఫోన్ 13 సిరీస్ లో ఈ ఏడాది విడుదల చేయబోయే ఐఫోన్ లు తాజా ఐఓస్ తోనే విడుదల కానున్నాయి. ఈ సంవత్సరం, ఆపిల్ సంస్థ iOS 15, tvOS 14, watchOS 8, iPadOS 15 ల తో పాటు macOS 12 లను పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది.