Anti-Drowning T-Shirt: ప్రమాదంలో పిల్లల్ని కాపాడే టీ_షర్ట్
Anti-Drowning T-Shirt: ప్రమాదంలో పిల్లల్ని కాపాడే టీ_షర్ట్
Anti-Drowning T-Shirt: నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త ఆవిష్కరణలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఆవిష్కరణకు సంబంధించిన వీడియోని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఆవిష్కరణ ప్రత్యేకత ఏంటంటే, నీటి ప్రమాదాల నుంచి చిన్నారులను రక్షిస్తుంది.
ఈమధ్య కాలంలో నీటిలో పడి చిన్నారులు మృతి చెందిన ఘటనలను తరచుగా వింటున్నాం. అప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న చిన్నారులు..నీటి బకెట్ లో పడి మృత్యువాత చెందినట్లు ఇటీవలే మనం ఒక వార్తను విన్నాం. అయితే ఇలాంటి ప్రమాదాలకు చెల్లు చీటీ పడేలా తాజా ఆవిష్కరణ ఉంది.
యువ శాస్త్రవేత్త ఆవిష్కరించిన ఓ టీ-షర్ట్ చిన్నారులను నీటి ప్రమాదాల బారి నుంచి రక్షిస్తుంది. అది ఎలా అంటే..ఈ టీ షర్ట్ ధరిస్తే..నీటిలో పడగానే ఇందులో ఉండే బెలూన్ ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. దీంతో టీ షర్ట్ ధరించిన చిన్నారులు నీట మునగకుండా తేలియాడతారు. దీంతో చిన్నారులకు ప్రాణ రక్షణ లభించడమే కాకుండా ప్రమాదంలో ఉన్న వీరిని రక్షించేందుకు కూడా వీలు ఉంటుంది. వరదల సమయంలో ఈ బెలూన్ టీ షర్ట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ ఆవిష్కరణ వీడియోను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ తో షేర్ చేశారు. ఇది నోబుల్ ప్రైజ్ గెలుచుకునే ఆవిష్కరణల కంటే గొప్పదంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ టీ_షర్ట్ ను 2 నుంచి 6 ఏళ్ల చిన్నారులను ఉద్దేశించి డిజైన్ చేశారు.