CNG Cars: సీఎన్‌జీ కార్లతో అద్భుత ప్రయోజనాలు.. ధర తక్కువ మైలేజీ ఎక్కువ..!
CNG Cars: దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
CNG Cars: దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలామంది సీఎన్‌జి కార్లకి మారాలని ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల కంటే సీఎన్‌జితో నడిచే కార్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి. సీఎన్‌జి ధరలు కూడా పెట్రోల్, డీజిల్ కంటే తక్కువగా ఉంటాయి. కాబట్టి దేశంలోని టాప్ 4 సీఎన్‌జి కార్ల గురించి తెలుసుకుందాం.
1. మారుతీ సుజుకి సెలెరియో
మారుతి సెలెరియో సిఎన్‌జి 35.6 కిమీల మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 6.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కారు 998 cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 57hp శక్తిని, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
2. మారుతీ వ్యాగన్ఆర్
మారుతి వ్యాగన్ఆర్ సిఎన్‌జి 32.52 కిమీల మైలేజీని ఇస్తుంది. ఇది 58 హెచ్‌పి పవర్, 78 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. కారు ధర రూ. 6.42 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభమవుతుంది.
3. మారుతీ ఆల్టో
మారుతి ఆల్టో సిఎన్‌జి 31.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది 35.3 kW పవర్, 69 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 796 cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఆల్టో ధర రూ.3.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.అయితే సీఎన్‌జీ కిట్ అందుబాటులో ఉన్న వేరియంట్ ధర రూ.5.03 లక్షలుగా ఉంది.
4. మారుతీ సుజుకి S-ప్రెస్సో
మారుతి సుజుకి S-ప్రెస్సో సీఎన్‌జి 31.2 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 5.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 59 PS పవర్, 78 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.