OTT: ఓటీటీ లవర్స్‌కి పండగే.. తక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌తో ఎక్కువ బెనిఫిట్స్‌

ఒక్కో ఓటీటీ కోసం ఒక్కో ప్లాన్‌ను తీసుకురావడానికి బదులుగా, ఒకే రీఛార్జ్‌తో పలు ఓటీటీల సబ్‌స్క్రిప్షన్స్‌ను అందిస్తున్నాయి.

Update: 2024-06-12 05:51 GMT

OTT: ఓటీటీ లవర్స్‌కి పండగే.. తక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌తో ఎక్కువ బెనిఫిట్స్‌

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఓటీటీ బిజినెస్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. థియేటర్లు మూతపడడంతో చాలా మంది ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఇక బడా నిర్మాణ సంస్థలు సైతం ఓటీటీ కోసం ప్రత్యేకంగా కంటెంట్ క్రియేట్ చేయడంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ఓటీటీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో చాలా మంది ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను తీసుకుంటున్నారు.

దీంతో ఓటీటీ సంస్థలు సైతం ఓటీటీ లవర్స్‌ను టార్గెట్ చేసుకొని రకరాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఓటీటీల కోసమే ప్రత్యేకంగా ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. ఒక్కో ఓటీటీ కోసం ఒక్కో ప్లాన్‌ను తీసుకురావడానికి బదులుగా, ఒకే రీఛార్జ్‌తో పలు ఓటీటీల సబ్‌స్క్రిప్షన్స్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ కొత్తగా రెండు పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ను పొందొచ్చు. మరి ఈ రెండు ప్లాన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 1199 ప్లాన్‌..

ఎయిర్‌టెల్ అందిస్తోన్న రూ. 1199 పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌తో 3 ఉచిత యాడ్ ఆన్‌ సిమ్‌లు పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే యూజర్లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. అలాగే ఈ ప్లాన్‌తో 240 జీబీ నెలవారీ డేటా పొందొచ్చు. ఇందులో ప్రాథమిక సిమ్‌తో 150GB, ప్రతీ యాడ్-ఆన్ కనెక్షన్‌కు 30GB డేటా ఉంటుంది. ఇందులో 200GB డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా ఉంది. ఇక ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 6 నెలల అమెజాన్‌ ప్రైమ్‌, ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. వీటితో పాటు హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే, వింక్ ప్రీమియం వంటివి కూడా పొందొచ్చు.

రూ. 1499 ప్లాన్‌..

రూ. 1499 పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లో 1 సాధారణ, 4 యాడ్-ఆన్ సిమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లో, కస్టమర్లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. దీంతో పాటు ఈ ప్లాన్‌లో మొత్తం 320GB నెలవారీ డేటా లభిస్తుంది. అలాగే ప్రాథమిక కనెక్షన్‌కు 200GB డేటా, ప్రతి యాడ్-ఆన్ కనెక్షన్‌కు 30GB డేటా లభిస్తుంది. వీటితో పాటు ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ స్టాండర్డ్‌ నెలవారాఈ సబ్‌స్క్రిప్షన్‌, 6 నెలల పాటు అమేజాన్‌ ప్రైమ్‌, ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ పొందొచ్చు. 

Tags:    

Similar News