Airtel: ఎయిర్‌టెల్ చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌.. వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Airtel: టెలికాం కంపెనీలు కస్టమర్లని ఆకర్షించడానికి కొత్త కొత్త రీచార్జ్‌ ప్లాన్లని ప్రవేశపెడుతాయి.

Update: 2023-06-16 09:07 GMT

Airtel: ఎయిర్‌టెల్ చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌.. వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Airtel: టెలికాం కంపెనీలు కస్టమర్లని ఆకర్షించడానికి కొత్త కొత్త రీచార్జ్‌ ప్లాన్లని ప్రవేశపెడుతాయి. మంచి ఆఫర్లతో తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ వరుసలో ఎయిర్‌టెల్‌ ముందుంటుంది. ఇటీవల మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 6GB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా పరిమితిని దాటిన తర్వాత ఇంటర్నెట్ డేటాను రీఛార్జ్ చేయాల్సిన వినియోగదారుల కోసం ఈ ప్లాన్‌ పనిచేస్తుంది. వోడాఫోన్ ఐడియా తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఇలాంటి డేటా వోచర్‌ను ప్రారంభించిన కొద్ది రోజులకే ఎయిర్‌టెల్ ఈ కొత్త డేటా ప్లాన్‌ను విడుదల చేసింది.

ఎయిర్‌టెల్ రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్‌ రూ.49 ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 రోజు మాత్రమే ఉంటుంది. ఇందులో 6GB డేటా వస్తుంది. ఇది ఇంటర్‌నెట్‌ ఎక్కువగా వనియోగించేవారికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులోనే ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ వైపు వెళ్లాలనుకుంటే అతను రూ.58 ప్లాన్ వైపు వెళ్లవచ్చు. ఇందులో 3GB డేటా వస్తుంది. మరోవైపు ఎయిర్‌టెల్ తన 5జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడంలో బిజీగా మారింది.

ప్రస్తుతం 5G NSA నెట్‌వర్క్‌ను 3000 కంటే ఎక్కువ నగరాలు, పట్టణాలలో విస్తరిస్తోంది. సంవత్సరం చివరి నాటికి అన్ని ముఖ్యమైన నగరాలు, పట్టణాలకు చేరుకోవడం దీని లక్ష్యం. మీరు ఎయిర్‌టెల్ వినియోగదారు అయితే 5Gని ఉపయోగించాలనుకుంటే రూ. 239 కంటే ఎక్కువ ప్లాన్‌ను కలిగి ఉండటం అవసరం. లేదంటే 5G సేవలని పొందలేరు. తీవ్ర అంతరాయం కలుగుతుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News