5G Technology: 5జీ టెక్నాలజీ ఎవరి ఆరోగ్యంపై ప్రభావం చూపదు- కాయ్‌

5G Technology: త్వరలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2021-06-07 01:59 GMT

రెప్రెసెంటేషనల్  ఇమేజ్ 


5G Technology: త్వరలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5జీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే 5జీ టెక్నాలజీ ఎవరి ఆరోగ్యంపైనా ప్రభావం చూపదని, తప్పుడు ప్రచారం జరుగుతోందని కాయ్‌ తెలిపింది. రాబోయే కాలంలో 5జీ గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపింది.

జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి అతిపెద్ద టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తక్కువ రేడియేషన్‌తోనే ఈ సేవలను తీసుకురానున్నాయి. ఇక 5జీ టెక్నాలజీ పూర్తి సురక్షితమని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని కాయ్‌ మరోసారి వివరించింది.

మరోవైపు 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటి, పర్యావరణ వేత్త జుహీ చావ్లా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఇది కేవలం ప్రచారం కోసిన వేసిన పిటిషన్‌ అన్న ధర్మాసనం జుహీ, మరికొందరికి 20లక్షల రూపాయల జరిమానా విధించింది.

Tags:    

Similar News