Virat Kohli: కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న కోహ్లీ
Virat Kohli: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్నాడు
Virat Kohli: కరోనా మమహ్మరి దేశ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెసిందే. కరోనా కట్టడికి పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు కరోనాను అడ్డుకోవాలంటే వ్యాక్సినేష్ ఒక్కటే మార్గం కావడంతో ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్నాడు. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా ఇన్ స్టా ద్వారా వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ టీకా వేసుకుంటున్న ఫొటోను సోమవారం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరాడు. తమ వంతు రాగానే ఆలస్యం చేయకుండా టీకా తీసుకోవాలన్నాడు. రెండ్రోజుల క్రితం డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కూడా వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్- భారత్ మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ లో జూన్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లాండ్ తో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే.