Pro Kabaddi League 2021: ప్రో కబడ్డీలో అత్యుత్తమ రైడర్‌లు వీరే..!
Pro Kabaddi League 2021: ప్రో కబడ్డీ లీగ్ 2021 బుధవారం నుంచి ప్రారంభమైంది.
Pro Kabaddi League Top Raiders: ప్రో కబడ్డీ లీగ్ 2021 బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, యు ముంబా తలపడిన సంగతి తెలిసిందే. ఇందులో బెంగాల్ వారియర్స్ సత్తా చాటి ముందడుగు వేసింది. గత సీజన్ పాయింట్ల పట్టికలో యు ముంబా నాలుగో స్థానంలో, బెంగళూరు బుల్స్ ఆరో స్థానంలో నిలిచాయి. కాగా దబాంగ్ ఢిల్లీ కేసీ గతేడాది ఛాంపియన్‌గా నిలిచింది.
ఇక ప్రో కబడ్డీ లీగ్‌లో టాప్ రైడర్ల గురించి మాట్లాడుకుంటే.. ఇందులో ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి పేర్లు ముందుంటాయనడంలో సందేమం లేదు. ఈ టోర్నీలో ఈ ఇద్దరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. రైడ్ పాయింట్ల పరంగా ప్రదీప్ నర్వాల్ అగ్రస్థానంలో నిలిచాడు. అదే సమయంలో రాహుల్ చౌదరి, దీపక్ నివాస్ హుడా కూడా ఈ జాబితాలో చేరారు.
ప్రో కబడ్డీలో ఓవరాల్ రైడ్ పాయింట్ల రికార్డును పరిశీలిస్తే, మొదటి ఐదు స్థానాల్లో ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరి, దీపక్ నివాస్ హుడా, అజయ్ ఠాకూర్, మణిందర్ సింగ్ ఉన్నారు. అత్యధిక రైడ్ పాయింట్ల పరంగా మణిందర్ 5వ స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 731 పాయింట్లు సాధించాడు.
బెంగాల్ వారియర్స్‌కు చెందిన మణిందర్ అనేక సందర్భాల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ జాబితాలో అజయ్ ఠాకూర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. దబాంగ్ ఢిల్లీ కేసీ అజయ్ 115 మ్యాచ్‌లు ఆడి 790 పాయింట్లు సాధించాడు. అజయ్ తన అద్భుతమైన దాడులకు ప్రసిద్ధిగాంచాడు.
ఆల్ రౌండర్ దీపక్ నివాస్ హుడా జైపూర్ పింక్ పాంథర్స్ తరపున ఆడుతున్నాడు. అత్యధిక రైడ్ పాయింట్ల పరంగా మూడో స్థానంలో ఉన్నాడు. దీపక్ 123 మ్యాచ్‌ల్లో 856 పాయింట్లు సాధించాడు. ఈ సమయంలో, అతని పాత్ర చాలా సార్లు జట్టుకు ముఖ్యమైనది.
ఈ జాబితాలో పుణెరి పల్టన్‌కు చెందిన రాహుల్ చౌదరి రెండో స్థానంలో నిలిచాడు. 122 మ్యాచ్‌ల్లో 955 పాయింట్లు సాధించాడు. ప్రో కబడ్డీ లీగ్‌లో బలమైన ఆటగాళ్లలో రాహుల్ ఒకడిగా నిలిచాడు.
యూపీ యోధా టాప్ ప్లేయర్ ప్రదీప్ నర్వాల్ ఓవరాల్ రైడ్ పాయింట్ల పరంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 107 మ్యాచ్‌లు ఆడి 1160 పాయింట్లు సాధించాడు. ప్రదీప్, రాహుల్ మధ్య 205 పాయింట్ల తేడా ఉంది. దీపక్, ప్రదీప్ మధ్య 304 పాయింట్ల గ్యాప్ ఉంది. అందువల్ల ప్రదీప్ స్థానాన్ని చేరుకోవడం ప్రస్తుతానికి ఏ ఆటగాడికీ అంత ఈజీ కాదు.