India vs Sri Lanka: రేపటి నుంచి టీమిండియా క్వారంటైన్ షురూ!
శ్రీలంక టూర్ కి టీమిండియా 2 ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ధావన్ సేన 14 రోజుల క్వారంటైన్ ఉండనుంది.
India vs Sri Lanka: శ్రీలంక టూర్ కి టీమిండియా 2 ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ధావన్ సేన 14 రోజుల క్వారంటైన్ ఉండనుంది. జూన్ 14 నుంచి 28 వరకు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముంబైలోని ఓ హోటల్లో క్వారంటైన్ ఉండనున్నారు. ఈ క్వారంటైన్ సమయంలో 6సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. క్లోహీ సేన పాటించిన రూల్సే.. ధావన్ సేన కూడా పాటిస్తుందని బీసీసీఐ పేర్కొంది. నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే కొలోంబో పంపనున్నారు.
జులై 13న లంక పర్యటన మొదలుకానుంది. ఈ పర్యటనలో శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. శ్రీలంక చేరుకున్నాక టీమిండియా మరో మూడు రోజులు క్వారంటైన్ ఉండనుంది. అనంతరం ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది.
శ్రీలంక వెళ్లే భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా.