Rohit Sharma| రోహిత్ శర్మ అరుదైన రికార్డు
Rohit Sharma: : ఐపీఎల్.. అతి పెద్ద క్రికెట్ సమరం. క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందుతోంది.... ఆరు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ఆటగాళ్లు అంతకుమించి అనే విధంగానే చెలరేగి పోతున్నారు.
Rohit Sharma : ఐపీఎల్.. అతి పెద్ద క్రికెట్ సమరం. క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఆరు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన ఆటగాళ్లు అంతకుమించి అనే విధంగానే చెలరేగి పోతున్నారు. ఏ ఆటగాడు తెరమీదికి వచ్చి ప్రతిభ కనబరుస్తాడో అన్న విషయాన్ని ప్రేక్షకులు కూడా ఊహించ లేకపోతున్నారు.
ఈ సీజన్ ముంబాయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అదే ఐపీఎల్లో 5000 పరుగుల క్లబ్‌లో చేరాడు హిట్ మ్యాన్. ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో గురువారం రాత్రి కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఈ రికార్డును సాధించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డును సాధించిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా మాత్రమే. తాజాగా రోహిత్ శర్మ కూడా వారి సరసన చేరాడు.
5000 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి రోహిత్ శర్మ కేవలం నాలుగు పరుగుల దూరంలో ఉన్నాడు. కింగ్స్ ఎలెవెన్‌తో మ్యాచ్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీకి తరలించిన రోహిత్.. 5000 పరుగులను అందుకున్నాడు. ఈ మైలు రాయిని అందుకోవడానికి రోహిత్ శర్మ మొత్తం 191 మ్యాచ్‌ను ఆడాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ-180, మ్యాచ్‌ల్లో చేయగా.. రైనా 193 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఇదే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ మరో ఘనతను సాధించింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుపై 600 పరుగుల రికార్డును నెలకొల్పాడు.